📄 ePaper
5pm
7pm
Wednesday, November 25, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణమంచిర్యాల జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలలో బంగారు పతకం సాధించిన నారాయణ పాఠశాల విద్యార్థి లక్ష్మీనరసింహ

మంచిర్యాల జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలలో బంగారు పతకం సాధించిన నారాయణ పాఠశాల విద్యార్థి లక్ష్మీనరసింహ

📰 Generate e-Paper Clip

మంచిర్యాల జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలలో బంగారు పతకం సాధించిన నారాయణ పాఠశాల విద్యార్థి లక్ష్మీనరసింహ

*మన ప్రజావాణి*
*మంచిర్యాల జిల్లా*

మంచిర్యాల జిల్లా భీమారం మండలంలోని జడ్.పి.హెచ్.ఎస్ పాఠశాలలో మంచిర్యాల జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ వారు నిర్వహించిన మంచిర్యాల జిల్లా స్థాయి ఓపెన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీలలో. మంచిర్యాల పట్టణంలోని నారాయణ పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్న లక్ష్మీనరసింహ అనే విద్యార్థి పాల్గొని లాంగ్ జంప్ విభాగంలో బంగారు పతకం సాధించినట్లు పాఠశాల ప్రిన్సిపల్ స్రవంతి బుధవారం రోజు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రిన్సిపల్ స్రవంతి మాట్లాడుతూ మా యొక్క పాఠశాలలో చదువులతోపాటు క్రీడలకు కూడా సమానమైనటువంటి ప్రాధాన్యత ఇస్తున్నామని. క్రీడల వల్ల విద్యార్థి యొక్క మానసిక శారీరిక ఎదుగుదల అనేది ఉంటుందని క్రీడాల వల్ల విద్యార్థి చదువులోనూ బాగా రాణిస్తాడని వారు తెలిపారు. జిల్లా స్థాయిలో బంగారు పతకం సాధించిన లక్ష్మీనరసింహ త్వరలో నవంబర్ 30 మరియు డిసెంబర్ 1 తేదీలలో నిజామాబాద్ లో జరిగే రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీల్లో పాల్గొంటారని వారు తెలిపారు. బంగారు పతకం సాధించిన లక్ష్మీనరసింహను నారాయణ పాఠశాల ఏజీఎం చైతన్య రావు అభినందించారు. ఈ యొక్క కార్యక్రమంలో పాఠశాల డీన్ వెంకటస్వామి. ఏజీఎం ఎనాలసిస్ట్ రాజేందర్ .వైస్ ప్రిన్సిపల్ సంధ్యారాణి. ఏవో రంగు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు..

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.