📄 ePaper
5pm
7pm
Wednesday, November 25, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeఎడిటోరియల్కాంగ్రెస్ బలోపేతానికి ఏడాదిగా అవిశ్రాంత కృషి, ధన్వంతి లక్ష్మినారాయణ కు అభినందనల వెల్లువ

కాంగ్రెస్ బలోపేతానికి ఏడాదిగా అవిశ్రాంత కృషి, ధన్వంతి లక్ష్మినారాయణ కు అభినందనల వెల్లువ

📰 Generate e-Paper Clip

 

 

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 25: జనగామ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షురాలిగా లకావత్ ధన్వంతి లక్ష్మీనారాయణ నాయక్ బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తి చేసుకున్న శుభసందర్భంగా బుధవారం ఆమెను ఘనంగా సత్కరించారు.

జనగామలోని విజయ మినీ ఫంక్షన్ హాల్ వద్ద కాంగ్రెస్ సేవాదళ్ జిల్లా అధ్యక్షులు జాయ మల్లేష్, డీసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ నరేందర్ పవార్ ఆధ్వర్యంలో ఆమెను శాలువాతో సన్మానించి, స్వీట్లు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, పార్టీ సంస్థాగత బలోపేతం, కార్యకర్తల సమన్వయం, ప్రజా సమస్యలపై పోరాటమే లక్ష్యంగా ఏడాదిగా ధన్వంతి అవిశ్రాంతంగా కృషి చేశారని కొనియాడారు. రాబోయే రోజుల్లో జనగామ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేస్తూ, ప్రజల పక్షాన మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో డీసీసీ ఈసీ మెంబర్ భూక్యా కోట నాయక్, కాంగ్రెస్ సేవాదళ్ జనగామ పట్టణ అధ్యక్షుడు కౌవిడె శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి మెంతన కిష్టయ్య, సహకార దర్శి మోటి మల్లేష్, జాయింట్ సెక్రటరీ బాలు జాదవ్, కాంగ్రెస్ సేవాదళ్ పాలకుర్తి నియోజకవర్గ అధ్యక్షులు రామ్ చందర్ నాయక్, డీసీసీ ప్రధాన కార్యదర్శి భాస్కర్ నాయక్, దేవరుప్పుల యూత్ కాంగ్రెస్ నాయకులు యాద నాయక్, మాజీ ఎంపీటీసీ బానోత్ బైగ్జాపతి నాయక్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.