కాంగ్రెస్ బలోపేతానికి ఏడాదిగా అవిశ్రాంత కృషి, ధన్వంతి లక్ష్మినారాయణ కు అభినందనల వెల్లువ

    జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 25: జనగామ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షురాలిగా లకావత్ ధన్వంతి లక్ష్మీనారాయణ నాయక్ బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తి చేసుకున్న శుభసందర్భంగా బుధవారం ఆమెను ఘనంగా సత్కరించారు. జనగామలోని విజయ మినీ ఫంక్షన్ హాల్ వద్ద కాంగ్రెస్ సేవాదళ్ జిల్లా అధ్యక్షులు జాయ మల్లేష్, డీసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ నరేందర్ పవార్ ఆధ్వర్యంలో ఆమెను శాలువాతో సన్మానించి, స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, పార్టీ సంస్థాగత బలోపేతం,...