📄 ePaper
5pm
7pm
Thursday, November 26, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణకవితపైచేసిన వ్యాఖ్యలకు మంత్రి సీతక్క బేషరతుగా క్షమాపణ చెప్పాలి

కవితపైచేసిన వ్యాఖ్యలకు మంత్రి సీతక్క బేషరతుగా క్షమాపణ చెప్పాలి

📰 Generate e-Paper Clip

కవితపైచేసిన వ్యాఖ్యలకు మంత్రి సీతక్క బేషరతుగా క్షమాపణ చెప్పాలి

తెలంగాణ రక్షణ సేన అధ్యక్షులు
లకవత్ వెంకటేష్ నాయక్

మద్దూరు నవంబర్24, ప్రజా వాణి

కల్వకుంట్ల కవితపై చేసిన వ్యాఖ్యలకు మంత్రి సీతక్క బేషరతుగా క్షమాపణ చెప్పాలని
తెలంగాణ రక్షణ సేన అధ్యక్షులు కల్వకుంట్ల కవితపై మంత్రి సీతక్క చేసిన వ్యాఖ్యలను తెలంగాణ రక్షణ సేన (బంజారా వింగ్) సిద్దిపేట జిల్లా అధ్యక్షులు లకవత్ వెంకటేష్ నాయక్ తీవ్రంగా ఖండించారు.కవితపై చేసిన వ్యాఖ్యలకు మంత్రి సీతక్క తక్షణమే బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా లకవత్ వెంకటేష్ నాయక్ మాట్లాడుతూ, రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలు చేయడం కోసం కవితపై తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు. బాధ్యత గల మంత్రి హోదాలో ఉండి ఒక మహిళా నాయకురాలిపై దారుణ వ్యాఖ్యలు చేయడం మంచిది కాదని, తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆయన హితవు పలికారు.
అలాగే, మంత్రి సీతక్క చేసిన ఈ వ్యాఖ్యలను ప్రసారం చేస్తున్న డిజిటల్ మీడియా చానళ్లు వెంటనే ఆ ప్రసారాలను నిలిపివేయాలని కోరారు. లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.