📄 ePaper
5pm
7pm
Tuesday, November 24, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణకుకునూరుపల్లి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా సందర్శించిన సీపీ రష్మి పెరుమాళ్

కుకునూరుపల్లి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా సందర్శించిన సీపీ రష్మి పెరుమాళ్

📰 Generate e-Paper Clip

కుకునూరుపల్లి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా సందర్శించిన

* సీపీ రష్మి పెరుమాళ్
* నిరంతర నిఘా ఉండాలి
* ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి
* సీసీ కెమెరాల ఏర్పాటుకు
* ప్రజలను ప్రోత్సహించాలి
* నేరాలు జరుగకుండా ముందస్తు
* జాగ్రత్తలు తీసుకోవాలి
* అసాంఘిక కార్యకలాపాలై
* కఠినoగా వ్యవహరించాలి

సిద్ధిపేట ప్రతినిధి, నవంబర్ 24 (ప్రజావాణి)

జిల్లాలోని కుకునూరుపల్లి పోలీస్ స్టేషన్‌ను పోలీస్ కమిషనర్ రష్మి పెరుమాళ్ మంగళవారం రోజున ఆకస్మికంగా సందర్శించారు.
ఈ సందర్భంగా సీపీ పోలీస్ స్టేషన్ ఆవరణను, స్టేషన్‌లోని వివిధ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. స్టేషన్ నిర్వహణతో పాటు, వివిధ కేసులలో సీజ్ చేసిన వాహనాలు, ఇతర క్రైమ్ ప్రాపర్టీని తనిఖీ చేసి, భద్రతా వ్యవస్థ పనితీరును సమీక్షించారు.అనంతరం ఆమె పోలీస్ సిబ్బందితో సమావేశమై పలు కీలక సూచనలు చేశారు.మండలంలోని గ్రామాలపై నిరంతరం నిఘా ఉంచాలని, శాంతిభద్రతల పరిరక్షణ మరియు ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. నేరాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, అసాంఘిక కార్యకలాపాలపై కఠినంగా వ్యవహరించాలని సూచించారు. నేరాల నియంత్రణ మరియు గ్రామాల భద్రత కోసం ‘సిద్దిపేట సురక్ష నేత్ర’ కార్యక్రమం కింద ప్రతి గ్రామంలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసుకునేలా ప్రజలను ప్రోత్సహించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో తోగుట సీఐ శ్రీను, కుకునూరుపల్లి ఎస్సై బాలకృష్ణ , పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.