📄 ePaper
5pm
7pm
Tuesday, November 24, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణకార్తీక పౌర్ణమి వేళ మండలంలో భక్తి సంద్రం... తెల్లవారుజాము 5 గంటల నుంచే క్యూ లైన్లు

కార్తీక పౌర్ణమి వేళ మండలంలో భక్తి సంద్రం… తెల్లవారుజాము 5 గంటల నుంచే క్యూ లైన్లు

📰 Generate e-Paper Clip

కార్తీక పౌర్ణమి వేళ మండలంలో భక్తి సంద్రం… తెల్లవారుజాము 5 గంటల నుంచే క్యూ లైన్లు

నవంబర్ 24 ప్రజావాణి న్యూస్/సంగెం

సంగెం మండలం, కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని సంగెం మండలంలోని సంగెం ఆశాలపల్లి. కుంట పెళ్లి గవి చర్ల. చింతల పెళ్లి. కాట్రపల్లి. రామచంద్రపురం. లోహిత.అన్ని గ్రామాల్లోని దేవాలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. భక్తి, ఆధ్యాత్మికతతో మండలమంతా మారుమోగిపోయింది.
తెల్లవారుజామున 5 గంటల నుంచే భక్తులు దేవాలయాలకు చేరుకుని బారులు తీరారు. చలిని సైతం లెక్క చేయకుండా, చిన్నా పెద్దా తేడా లేకుండా క్యూ లైన్లలో నిలబడి స్వామి వారిని దర్శించుకున్నారు.
మండలంలోని అన్ని గ్రామాల్లోని శివాలయాలు, రామాలయాలు, హనుమాన్ ఆలయాల్లో ప్రత్యేక అభిషేకాలు, పూజలు, కార్తీక దీపోత్సవాలు ఘనంగా నిర్వహించారు. భక్తులు దీపాలు వెలిగించి, మొక్కులు తీర్చుకున్నారు.
ఎక్కడ చూసినా “హర హర మహాదేవ, ఓం నమః శివాయ” నామస్మరణతో ఆలయ ప్రాంగణాలన్నీ మార్మోగాయి. మహిళలు పూలతో, పండ్లతో పూజలు చేసి, కార్తీక వనభోజనాలతో సందడి చేశారు.భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీలు, గ్రామ పెద్దలు, యువకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మంచినీటి సౌకర్యం, క్యూ లైన్ నిర్వహణతో దర్శనాలు ప్రశాంతంగా సాగాయి.కార్తీక పౌర్ణమి అంటేనే భక్తి. భక్తి అంటేనే మన గ్రామాల సంస్కృతి అని మరోసారి నిరూపితమైంది. దేవాలయాల్లో ప్రజా ప్రతినిధులు గ్రామ ప్రజలు దర్శ నం చేసుకోవడం జరిగింది

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.