కన్నుల పండువగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవం
అంగరంగ వైభవంగా స్వామివారి కల్యాణ మహోత్సవం.. భక్తుల కోలాహలం
ప్రజావాణి జిల్లా ప్రతినిది
పెద్దపల్లి, నవంబర్ 24:
పెద్దపల్లి జిల్లా దేవునిపల్లి గ్రామంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవం మంగళవారం కన్నుల పండువగా, అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకొని ఆలయాన్ని పూలమాలలు, విద్యుద్దీపాలతో సుందరంగా అలంకరించారు. వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి కల్యాణ వేడుకలు భక్తిశ్రద్ధలతో సాగాయి.ఆలయ ఏ వో శంకరయ్య మాట్లాడుతూ
ఈ పవిత్ర వేడుకను తిలకించేందుకు గ్రామంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. స్వామివారి కల్యాణాన్ని వీక్షిస్తూ భక్తులు భక్తిపారవశ్యంలో మునిగిపోయారు. ఆలయ ప్రాంగణమంతా గోవింద నామస్మరణలు, భక్తుల జయజయధ్వానాలతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.
కల్యాణోత్సవంలో పాల్గొన్న భక్తులు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి కృపాకటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని, గ్రామం సుభిక్షంగా ఉండాలని భక్తులు ప్రార్థించారు. సంప్రదాయబద్ధంగా నిర్వహించిన ఈ కల్యాణ మహోత్సవం దేవునిపల్లి గ్రామంలో పండుగ వాతావరణాన్ని నింపింది.

