కన్నుల పండువగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవం
కన్నుల పండువగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా స్వామివారి కల్యాణ మహోత్సవం.. భక్తుల కోలాహలం ప్రజావాణి జిల్లా ప్రతినిది పెద్దపల్లి, నవంబర్ 24: పెద్దపల్లి జిల్లా దేవునిపల్లి గ్రామంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవం మంగళవారం కన్నుల పండువగా, అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకొని ఆలయాన్ని పూలమాలలు, విద్యుద్దీపాలతో సుందరంగా అలంకరించారు. వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి కల్యాణ వేడుకలు భక్తిశ్రద్ధలతో సాగాయి.ఆలయ ఏ వో శంకరయ్య మాట్లాడుతూ ఈ పవిత్ర వేడుకను తిలకించేందుకు గ్రామంతో పాటు పరిసర ప్రాంతాల...