ఉపాధి హామీ సామాజిక తనిఖీ గ్రామసభ
*ఉపాధి హామీ సామాజిక తనిఖీ గ్రామసభ* రాయికల్, నవంబర్ 23(ప్రజావాణి) రాయికల్ మండలంలోని వీరాపూర్ గ్రామంలో 2025 ఏప్రిల్ నుండి 2026 మార్చి వరకు గ్రామంలో జరిగిన ఉపాధి హామీ పనులు, చేయూత ద్వారా అందజేస్తున్న పింఛన్ వివరాలను సామాజిక తనిఖీ డీఆర్పీ కొత్తపెల్లి మమత పర్యవేక్షణలో సిబ్బంది 4 రోజులపాటు గ్రామంలో ఇంటింటికి తిరిగి వివరాలను సేకరించారు. కేవలం పత్రాల్లోని లెక్కలకే పరిమితం కాకుండా, పని ప్రదేశాలకు వెళ్లి కొలతలు తీసి, కూలీలను, పింఛన్ లబ్ధిదారులను నేరుగా కలిసి, ఎన్ని రోజులు పని...