📄 ePaper
5pm
7pm
Sunday, November 22, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణశ్రీరామ మందిర శంకుస్థాపన మహోత్సవం లో పాల్గొన్న ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్

శ్రీరామ మందిర శంకుస్థాపన మహోత్సవం లో పాల్గొన్న ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్

📰 Generate e-Paper Clip

శ్రీరామ మందిర శంకుస్థాపన మహోత్సవం లో పాల్గొన్న
ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్

ప్రజావాణి మిర్యాలగూడ నియోజకవర్గం నవంబర్ 22

అడవిదేవులపల్లి గ్రామం లోని
శ్రీరామ మందిర శంకుస్థాపన మహోత్సవం లో
ముఖ్య అతిధులుగా పాల్గొన్న
ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్
ఈ రోజు అడవిదేవులపల్లి గ్రామంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించిన శ్రీరామ మందిర శంకుస్థాపన పూజా కార్యక్రమానికి కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ హాజరై ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శ్రీ సీతారామచంద్ర స్వామివారిని దర్శించుకుని స్వామివారి ఆశీస్సులు పొందారు.
శ్రీరామ మందిర నిర్మాణం గ్రామ ప్రజలందరి ఐక్యతకు, భక్తిభావానికి, ఆధ్యాత్మిక చైతన్యానికి ప్రతీకగా నిలవాలని ఆకాంక్షించారు. ఆలయ నిర్మాణ కార్యక్రమం ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా పూర్తికావాలని, భవిష్యత్తులో ఈ మందిరం గ్రామ ప్రజలకు ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు.
శ్రీరామచంద్ర స్వామివారి దివ్య ఆశీస్సులతో అడవిదేవులపల్లి గ్రామం సుఖశాంతులతో, సిరిసంపదలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమం లో గ్రామ సర్పంచ్ కూరాకుల చిన రామయ్య మరియు శ్రీరామ మందిర నిర్మాణం సభ్యులు పాల్గొన్నరు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.