📄 ePaper
5pm
7pm
Sunday, November 22, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి

ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి

📰 Generate e-Paper Clip

ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి – BLR

ప్రజావాణి మిర్యాలగూడ నియోజకవర్గం నవంబర్ 22

ఈరోజు అడవిదేవులపల్లి మండల కేంద్రంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం నమోదు కార్యక్రమంలో మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి -BLR పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మండల కేంద్రంలోని ప్రతి ఇంటికీ వెళ్లి అర్హులైన కుటుంబాల వివరాలను సేకరించి, ప్రతి కుటుంబానికి జీవిత బీమా పథకం అందేలా నమోదు ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని సంబంధిత అధికారులకు సూచించారు.
ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని, ప్రతి పేద కుటుంబానికి సామాజిక భద్రత కల్పించడంతో పాటు ఆర్థిక భరోసా అందించడమే ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు…
అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, నమోదు ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు
ఈ కార్యక్రమంలో
గ్రామపంచాయతీ సర్పంచ్ కూరాకుల చిన రామయ్య
కార్యదర్శి దుర్గయ్య
బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పొదిలా శ్రీనివాస్ మండల పార్టీ అధ్యక్షులు రామావత్ బాలు నాయక్ బండి నాగేశ్వరావు గుండా శ్రీనివాస్ గోపగాని హనుమంతు
స్థానిక ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ నాయకులు, అధికారులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.