శాలపల్లిలో చిన్నారులకు పోలియో చుక్కల పంపిణీ కార్యక్రమం ప్రారంభించిన సర్పంచ్ కూరపాటి అశోక్

**శాలపల్లిలో చిన్నారులకు పోలియో చుక్కల పంపిణీ కార్యక్రమం ప్రారంభించిన సర్పంచ్ కూరపాటి అశోక్** వేలేరు మండలం శాలపల్లి గ్రామంలో చిన్నారులకు పోలియో వ్యాధి నుంచి శాశ్వత రక్షణ కల్పించే లక్ష్యంతో పల్స్ పోలియో చుక్కల పంపిణీ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ కూరపాటి అశోక్ గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా చిన్నారులందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి, పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని సూచించారు. ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయించడం ద్వారా భవిష్యత్తులో అంగవైకల్యానికి కారణమయ్యే పోలియో వ్యాధిని నివారించవచ్చని...