వికారాబాద్ జిల్లా లో ఘోర రోడ్డు ప్రమాదం.
స్పాట్ లోనే నలుగురు మృతి
ప్రజా వాణి, వికారాబాద్ జిల్లా,నవంబర్22:
వికారాబాద్ జిల్లా అనంతగిరి చుట్టూముట్టు రోడ్లు యమపాశలుగా మారుతున్నాయి.గత కొన్ని రోజుల క్రితం జరిగిన బసు ప్రమాదం మరువక ముందే మరో ప్రమాదం చోటు చేసుకోవడం కలకలం రేపింది.ఆదివారంనాడు బుగ్గ రామ లింగేశ్వర స్వామి ఆలయం వద్ద ఆటో లారీ డి కొన్నాయి.ఆ ప్రమాదంలో వికారాబాద్ మండలం పెండ్లిమడుగు గ్రామం నుండి కేరెల్లి కి వెళ్తున్న ఆటో డి కొంది. మృతుల లో ముగ్గురు మహిళలు ఒక ఆటో డ్రైవర్ ఉన్నారు.ఓకే కుటుంబానికి చెందిన నలుగురు ఉన్నట్లు సమాచారం మృతులు నాగేష్,చంద్రమ్మ,పార్వతమ్మ , సరిత ఉన్నారు. మూల మలుపులు ప్రమాదకరంగా ఉంటాటమే ప్రమాదానికి కారణం కాగా,సూచిక బోర్డులు సైతం లేకపోవడం వల్ల రోడ్లు ప్రమాదాలకు కారణం అవుతునాయు.

