*డబిల్‌పూర్‌లో పల్స్ పోలియో కార్యక్రమం.. చిన్నారులకు చుక్కలు వేసిన కౌన్సిలర్ ఆరిఫ్*
మేడ్చల్ (ప్రజావాణి) 0–5 సంవత్సరాల పిల్లలకు ప్రతిసారి పోలియో చుక్కలు వేయించాలి – కౌన్సిలర్ ఆరిఫ్ పోలియో రహిత భారత్‌ను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలోని డబిల్‌పూర్ గ్రామంలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో 23వ వార్డు కౌన్సిలర్ ఆరిఫ్ పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా చిన్నారుల తల్లిదండ్రులకు పోలియో వ్యాధి నివారణ, టీకాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ ఆరిఫ్ మాట్లాడుతూ, భారతదేశం పోలియో రహిత దేశంగా నిలిచినప్పటికీ, ప్రపంచంలోని కొన్ని దేశాల్లో ఇప్పటికీ పోలియో వైరస్ ఉనికిలో ఉందని తెలిపారు. ఇతర దేశాల నుంచి వైరస్ తిరిగి వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని, చిన్నారుల ఆరోగ్యం విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం చేయకూడదని సూచించారు.
0 నుంచి 5 సంవత్సరాల లోపు పిల్లలకు ప్రతి పల్స్ పోలియో కార్యక్రమంలో తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని, ఒక్కసారి చుక్కలు వేసినంత మాత్రాన సరిపోదని, ప్రభుత్వం నిర్వహించే ప్రతి విడత కార్యక్రమంలోనూ పిల్లలకు పోలియో మోతాదు అందించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. పోలియోపై దేశం సాధించిన విజయాన్ని కొనసాగించేందుకు ప్రజలందరూ భాగస్వాములు కావాలని, ప్రతి చిన్నారికి పోలియో రక్షణ కల్పించడమే లక్ష్యంగా పనిచేయాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ యువజన కాంగ్రెస్ నాయకుడు సల్ల వెంకటేష్ యాదవ్, మేడ్చల్ మండల కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ అధ్యక్షుడు దుడ్డు కుమార్, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

