📄 ePaper
5pm
7pm
Saturday, November 21, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeఆంధ్రప్రదేశ్వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ భారీ ఇంటింటి ప్రచారం: చంద్రబాబు మోసపూరిత పాలనపై పోతిరెడ్డి నాగార్జున రెడ్డి...

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ భారీ ఇంటింటి ప్రచారం: చంద్రబాబు మోసపూరిత పాలనపై పోతిరెడ్డి నాగార్జున రెడ్డి ధ్వజం

📰 Generate e-Paper Clip

కవలకుంట్ల/పోరుమామిళ్ల నవంబర్ 21ప్రజావాణి బద్వేల్ నియోజకవర్గం,పోరుమామిళ్ల మండలం, కవలకుంట్ల గ్రామపంచాయతీ పరిధిలోని బుచ్చంపల్లి గ్రామంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసిపి) అభ్యర్థి విజయార్థం శనివారం భారీ ఎత్తున ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించారు.ఈ ప్రచారంలో మాజీ పంచాయతీ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ప్రభుత్వ సలహాదారు పోతిరెడ్డి నాగార్జునరెడ్డ,మాజీ సర్పంచ్ మరియు సీనియర్ అడ్వకేట్ కె.ప్రభాకర్ రావు,స్థానిక పంచాయతీ వైసిపి నాయకులు,కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.వైసిపి మద్దతు తెలిపిన అభ్యర్థికి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతూ నాయకులు గ్రామంలో విస్తృతంగా పర్యటించారు.ఈ కార్యక్రమానికి బుచ్చంపల్లి గ్రామస్థుల నుండి భారీ ఎత్తున స్పందన లభించింది.సూపర్ సిక్స్ పథకాల పేరిట ప్రజలను మోసం చేశారు: ఈ సందర్భంగా మాజీ ప్రభుత్వ సలహాదారు పోతిరెడ్డి నాగార్జున రెడ్డి మాట్లాడుతూ,ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు ప్రజలను మభ్యపెట్టేలా వ్యవహరించారని విమర్శించారు.వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అందించిన సంక్షేమ పథకాల కంటే మిన్నగా పథకాలు ఇస్తామని,సూపర్ సిక్స్’పథకాలను ప్రవేశపెడతామని నమ్మబలికి,ప్రజలను మోసం చేసి ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చారని మండిపడ్డారు.గద్దెనెక్కిన తర్వాత ఆ సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు.ఆంధ్రప్రదేశ్‌ను అప్పుల్లో అగ్రస్థానంలో నిలిపారు: గతంలో తాము వస్తే సంపద సృష్టిస్తామని గొప్పలు చెప్పిన కూటమి ప్రభుత్వం, నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టివేసిందని నాగార్జున రెడ్డి గారు విమర్శించారు. దేశంలోనే అప్పుల్లో ఆంధ్రప్రదేశ్‌ను అగ్రస్థానంలో నిలబెట్టిన ఘనత ఈ ప్రభుత్వానికే దక్కుతుందని ఎద్దేవా చేశారు.అధికార బలం, పోలీసులతో ఏకగ్రీవాలు – ప్రజాస్వామ్య ఖూనీ:ప్రస్తుత పాలనలో ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా కాలరాస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపాలిటీ,కార్పొరేషన్,ఎంపీటీసీ,జెడ్పీటీసీ ఎన్నికల్లో అధికారులను,పోలీసులను అడ్డం పెట్టుకుని, బెదిరింపులకు గురిచేస్తూ ఏకగ్రీవాలు చేసుకున్నారని ఆరోపించారు.రాష్ట్ర చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ రకమైన అప్రజాస్వామిక ధోరణి కొనసాగుతోందని దుయ్యబట్టారు.ప్రస్తుత ప్రభుత్వ వైఫల్యాలు,ప్రజా వ్యతిరేక విధానాల వల్ల ప్రజల్లో అప్పుడే తెలుగుదేశం పార్టీపై తీవ్ర వ్యతిరేకత మొదలైందని స్పష్టం చేశారు.2029లో మళ్లీ జగనన్న అధికారంలోకి రావడం ఖాయం:ప్రజలంతా మళ్లీ జగనన్న సంక్షేమ పాలనను కోరుకుంటున్నారని, వచ్చే 2029 ఎన్నికల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి,మళ్లీ ముఖ్యమంత్రి కావడం తథ్యమని నాగార్జున రెడ్డి,ధీమా వ్యక్తం చేశారు.అందుకే ఈ పంచాయతీ ఎన్నికల్లో వైసిపి మద్దతు లభించిన అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించి,ప్రభుత్వానికి కనువిప్పు కలిగించాలని ఓటర్లను కోరారు.నిష్పక్షపాతంగా ఎన్నికలు –ప్రజలెవరూ భయపడొద్దు:సర్పంచ్ ఎన్నికల నిర్వహణపై జిల్లా ఎస్పీ సానుకూలంగా స్పందించారని,ఎన్నికలను పూర్తిగా నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహిస్తామని హామీ ఇచ్చారని నాగార్జున రెడ్డి,ఈ సందర్భంగా గుర్తుచేశారు.కాబట్టి గ్రామాల్లో ఓటర్లు ఎవరూ కూడా ఎటువంటి బెదిరింపులకు లొంగిపోవాల్సిన లేదా భయపడాల్సిన అవసరం లేదని ధైర్యం చెప్పారు. ప్రజలంతా స్వేచ్ఛగా తరలివచ్చి తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకోవాలని,వైసిపి మద్దతుదారుడిని గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ ప్రచార కార్యక్రమంలో స్థానిక వైసిపి నాయకులు, మహిళలు, యువకులు మరియు బుచ్చంపల్లి గ్రామ ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని వైసిపి అభ్యర్థికి తమ పూర్తి మద్దతును ప్రకటించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.