📄 ePaper
5pm
7pm
Saturday, November 21, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeఎడిటోరియల్తిమ్మాయిపల్లిలో ఇందిరమ్మ బీమా పథకం ప్రారంభం

తిమ్మాయిపల్లిలో ఇందిరమ్మ బీమా పథకం ప్రారంభం

📰 Generate e-Paper Clip

18 నుంచి 59 ఏళ్ల వయస్సు గల అర్హులకు రూ.5 లక్షల జీవిత బీమా భరోసా

బెజ్జంకి, నవంబర్ 20 (ప్రజావాణి)

కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం తిమ్మాయిపల్లి గ్రామంలో శనివారం ప్రారంభించారు. ఎంపీడీవో ఆదేశాల మేరకు గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో సర్పంచ్ దానబోయిన సత్తవ్వ–పోచయ్య ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. 18 నుంచి 59 ఏళ్ల వయస్సు గల అర్హులైన ప్రతి ఒక్కరికీ రూ.5 లక్షల జీవిత బీమా సౌకర్యం కల్పించడం ఈ పథకం ప్రధాన ఉద్దేశమని తెలిపారు.అర్హులైన ప్రతి కుటుంబం ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు గ్రామంలోని ప్రతి అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా గ్రామపంచాయతీ తరఫున కృషి చేస్తామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ చాణగొండ పుష్పవ్వ, వార్డు సభ్యులు మ్యాకల శ్రీనివాస్, రాజు, ప్రదీప్, సంధ్య, శ్రీలత, ఎల్లవ్వ, పంచాయతీ కార్యదర్శి వంశీ, కంప్యూటర్ ఆపరేటర్ సాగర్,గ్రామపంచాయతీ సిబ్బంది తిరుపతి, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.