ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని బిజిగిరి షరీఫ్ గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి
* కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ మండల అధ్యక్షుడు రాచపల్లి రాజకుమార్
* గ్రామంలో ఉన్న ప్రజలు ఆన్లైన్ నమోదుఅర్హులకు ఇందిరమ్మ చేయూత పింఛన్ పత్రాల పంపిణీ
జమ్మికుంట నవంబర్ 21 (ప్రజావాణి)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని సేవాదళ్ మండల్ అధ్యక్షుడు రాచపల్లి రాజ్ కుమార్ అన్నారు. భారత మాజీ ప్రధాని, ఉక్కు మహిళ స్వర్గీయ ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకొని నవంబర్ 19న రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా, ఇందిరమ్మ చేయూత పథకాలను ప్రారంభించిందని తెలిపారు. కుటుంబ పెద్ద ప్రమాదవశాత్తు మరణించినప్పుడు ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా అండగా నిలిచేందుకు రూ.5 లక్షల ప్రమాద బీమా సౌకర్యాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిందని పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా అర్హులైన కుటుంబాలకు భరోసా కల్పించడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమన్నారు. ఈ నేపథ్యంలో శు క్రవారం జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల్లో వార్డు అధికారులు, వార్డు కౌన్సిలర్ల సమన్వయంతో ఆన్లైన్ నమోదు కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు వెల్లడించారు. పట్టణ ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నమోదు చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ మండల్ అధ్యక్షుడు రాచపల్లి రాజ్ కుమార్ విజ్ఞప్తి అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ చేయూత పింఛన్ పత్రాలను అందజేశారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని ఈ సందర్భంగా సూచించారు.

