📄 ePaper
5pm
7pm
Thursday, November 19, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణమిర్యాలగూడలో ఘనంగా ఇందిరా గాంధీ 109వ జయంతి వేడుకలు

మిర్యాలగూడలో ఘనంగా ఇందిరా గాంధీ 109వ జయంతి వేడుకలు

📰 Generate e-Paper Clip

-మిర్యాలగూడలో ఘనంగా ఇందిరా గాంధీ 109వ
జయంతి వేడుకలు
ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి – BLR

-ఇందిరా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి – BLR

ప్రజావాణి మిర్యాలగూడ నియోజకవర్గం నవంబర్ 19

మిర్యాలగూడ పట్టణంలో శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి – BLR ఆధ్వర్యంలో భారతదేశ తొలి మహిళా ప్రధానమంత్రి, *స్వర్గీయ ఇందిరా గాంధీ 109వ జయంతి* వేడుకలు ఘనంగా నిర్వహించారు…
ఈ సందర్భంగా మిర్యాలగూడ పట్టణంలోని ఇందిరా గాంధీ విగ్రహం వద్ద ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి కాంగ్రెస్ నాయకులు, మహిళలతో కలిసి ఇందిరా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు…
అనంతరం ఇందిరమ్మ చీరలు ధరించి కార్యక్రమానికి హాజరైన మహిళలతో కలిసి కేక్ కట్ చేసి జయంతి వేడుకలను ఆనందోత్సాహాల మధ్య నిర్వహించారు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. భారతదేశ తొలి మహిళా ప్రధానిగా ఇందిరా గాంధీ దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. దేశ సమగ్రత, సమైక్యత, అభివృద్ధి కోసం ఆమె చేసిన కృషి ఎప్పటికీ ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. ధైర్యం, దృఢ సంకల్పం, నాయకత్వ లక్షణాలతో ప్రపంచ స్థాయిలో భారతదేశానికి ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన గొప్ప నాయకురాలు ఇందిరా గాంధీ గారని కొనియాడారు.
మహిళలు అన్ని రంగాల్లో ముందుకు సాగేందుకు ఆమె నాయకత్వం, సాధించిన విజయాలు స్ఫూర్తిదాయకమని అన్నారు. మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ, మహిళలకు ఆర్థిక భరోసా కల్పించే దిశగా ప్రజా ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలిపారు. ఇందిరా గాంధీ గారి ఆశయాలు, ప్రజాసేవా స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ప్రజల సంక్షేమం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చిలుకూరి సుధా బాలకృష్ణ గారు వైస్ చైర్మన్ గుడిపాటి శిరీష నవీన్ గారు ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.