📄 ePaper
5pm
7pm
Thursday, November 19, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణప్రతి పేద కుటుంబానికి రూ.5 లక్షల బీమా భరోసా – శాలపల్లిలో అవగాహన కార్యక్రమం

ప్రతి పేద కుటుంబానికి రూ.5 లక్షల బీమా భరోసా – శాలపల్లిలో అవగాహన కార్యక్రమం

📰 Generate e-Paper Clip

**ప్రతి పేద కుటుంబానికి రూ.5 లక్షల బీమా భరోసా – శాలపల్లిలో అవగాహన కార్యక్రమం**

వేలేరు: ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రూ.5 లక్షల ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై హనుమకొండ జిల్లా వేలేరు మండలం శాలపల్లి గ్రామంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ కూరపాటి అశోక్ మాట్లాడుతూ గ్రామంలోని ప్రతి కుటుంబం రేషన్ కార్డు, ఆధార్ కార్డు వివరాలతో గ్రామపంచాయతీకి వచ్చి బీమా పథకంలో నమోదు చేసుకోవాలని కోరారు. పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే ఈ పథకం లక్ష్యమని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ ఎర్రగొల్ల రమేష్, వార్డు సభ్యులు, గ్రామ కార్యదర్శి విజయ్ కుమార్, కాంగ్రెస్ నాయకులు, మహిళా ప్రతినిధులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.