బద్వేల్ రాజకీయంలో పెను సంచలనం:సొంత మండలంలోనే టీడీపీ ఇంచార్జ్ సూర్యనారాయణ రెడ్డికి ఎదురుదెబ్బ.వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన 20 కుటుంబాలు!

కడప జిల్లా నవంబర్ 19ప్రజావాణి బద్వేల్ నియోజకవర్గ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. తెలుగుదేశం పార్టీ బద్వేల్ నియోజకవర్గ ఇన్‌చార్జి సురేష్ సూర్యనారాయణ రెడ్డికి ఆయన సొంత మండలంలోనే తీవ్ర అసంతృప్తి,గట్టి ఎదురుదెబ్బ తగిలింది.అట్లూరు మండలం రెడ్డిపల్లి ఎస్సీ కాలనీకి చెందిన 20 కుటుంబాలు టీడీపీని వీడి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నాయి.పోరుమామిళ్లలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో ఈ చేరికలు జరిగాయి. బద్వేల్ నియోజకవర్గ ఇన్‌చార్జి,ఎమ్మెల్సీ డి.సి.గోవిందరెడ్డి, నియోజకవర్గ యువ నాయకుడు మరియు ఎన్నికల రథసారథి...