📄 ePaper
5pm
7pm
Thursday, November 19, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
HomeతెలంగాణJangaonపేదల సంక్షేమమే లక్ష్యంగా పాలించిన మహానేత ఇందిరా గాంధీ..

పేదల సంక్షేమమే లక్ష్యంగా పాలించిన మహానేత ఇందిరా గాంధీ..

📰 Generate e-Paper Clip

పేదల సంక్షేమమే లక్ష్యంగా పాలించిన మహానేత ఇందిరా గాంధీ..
మహదేవుని శ్రీనివాస్

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 19 (ప్రజావాణి):జనగామ నియోజకవర్గం కొమురవెల్లి మండల కేంద్రంలో భారత మాజీ ప్రధానమంత్రి, భారతరత్న, స్వర్గీయ ఇందిరా గాంధీ జయంతి వేడుకలను కొమురవెల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహదేవుని శ్రీనివాస్ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా ముందుగా ఇందిరా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి, పూలతో ఘనంగా నివాళులర్పించారు. కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని ఇందిరమ్మకు జోహార్లు అర్పించారు.

ఈ సందర్భంగా మహదేవుని శ్రీనివాస్ గారు మాట్లాడుతూ, భారతదేశ తొలి మహిళా ప్రధానమంత్రిగా దేశానికి విశిష్ట సేవలందించిన ఇందిరా గాంధీ దేశ ఐక్యత, సమగ్రత, అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేశారని అన్నారు.

పేదలు, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం ఆమె తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాలు దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని పేర్కొన్నారు. బ్యాంకుల జాతీయీకరణ, గరీబీ హఠావో నినాదం, భూసంస్కరణలు వంటి కార్యక్రమాల ద్వారా పేదల జీవితాల్లో వెలుగులు నింపారని గుర్తుచేశారు.

దేశం పట్ల ఆమెకున్న అంకితభావం, ధైర్యసాహసాలు, దృఢమైన నాయకత్వం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని తెలిపారు. దేశ రక్షణ, సార్వభౌమాధికారం కోసం ఆమె ఎన్నో సవాళ్లను ఎదుర్కొని దేశాన్ని ముందుకు నడిపించారని అన్నారు.

ఇందిరమ్మ ఆశయాలు, సిద్ధాంతాలను ఆదర్శంగా తీసుకొని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజాసేవలో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. పేదల సంక్షేమమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని, గ్రామ గ్రామాన ఇందిరమ్మ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు.

ఈ కార్యక్రమంలో లింగంపల్లి శ్రీనివాస్, చెరుకు రమణా రెడ్డి, గొల్లపల్లి శ్రీనివాస్, కొయ్యడ శ్రీనివాస్, లింగంపల్లి కనకరాజు, మల్లం బాల్లయ్య, బొచ్చు ఎల్లయ్య, కుక్కల సత్తయ్య, గంగుల ఐలయ్య, చింతల పరశురాములు, బత్తిని నర్సింహులు గౌడ్, జనగాం శ్రీకాంత్, స్వాములపల్లి రమేష్, సార్ల లింగం, శెట్టిపల్లి విజేందర్, మాట్లా మురళీ, ఏర్పుల రాజు, యేనిశెట్టి కిరణ్, కానుగుల బాబు, గీస లింగం, మాచర్ల యాదగిరి, పబ్బోజు రాములు చారి, ముత్యం అంజయ్య, కొండ వెంకటేష్, పొతుగంటి యాదగిరి, మేడికుంట శ్రీనివాస్, దండ్యాల వెంకట నర్సింహారెడ్డి, పబ్బోజు శ్రీనివాస్, సిలివేరు మల్లేశం, చింతల రమేష్ మరియు అభిమానులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.