జగిత్యాల జిల్లా కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో చందనోత్సవం వైభవంగా సాగుతోంది. ఇందులో భాగంగా మూలవిరాట్‌కు అలంకరించిన చందనాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా తొలగించినట్లు ఆలయ ఈవో అంజనారెడ్డి తెలిపారు. అనంతరం చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్, రీజనల్ జాయింట్ కమిషనర్ రామకృష్ణారావు ఆధ్వర్యంలో అధికారులు ఆ చందనాన్ని తూకం వేయగా, మొత్తం 99 కిలోల 720 గ్రాముల బరువు వచ్చింది. ఈ చందనానికి పంచనామా నిర్వహించిన అధికారులు, అనంతరం దానికి సీల్ వేసి భద్రపరిచారు.

