📄 ePaper
5pm
7pm
Wednesday, November 18, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeఆంధ్రప్రదేశ్సచివాలయం తెరిచే ఉంది. సిబ్బంది మాత్రం పత్తాలేరు! విలువైన పత్రాలు,కంప్యూటర్లు గాల్లో దీపాలేనా? రంగసముద్రం-2 సచివాలయంలో...

సచివాలయం తెరిచే ఉంది. సిబ్బంది మాత్రం పత్తాలేరు! విలువైన పత్రాలు,కంప్యూటర్లు గాల్లో దీపాలేనా? రంగసముద్రం-2 సచివాలయంలో అధికారుల ఘోర నిర్లక్ష్యం

📰 Generate e-Paper Clip

పోరుమామిళ్ల,నవంబర్ 18:ప్రజావాణి ప్రభుత్వ ఆస్తులకు రక్షణ కల్పించాల్సిన వారే బాధ్యతారహితంగా వ్యవహరిస్తే ఎలా?ప్రజల సమస్యలు తీర్చాల్సిన కార్యాలయాలే భద్రత లేకుండా దర్శనమిస్తే పరిస్థితి ఏంటి? కడప జిల్లా పోరుమామిళ్ల మండలం రంగసముద్రం-2 గ్రామ సచివాలయంలో బుధవారం ఇటువంటి దారుణమైన ఘటనే చోటుచేసుకుంది.సచివాలయాన్ని పూర్తిగా తెరిచి ఉంచి, లోపల ఒక్క అధికారి లేదా సిబ్బంది కూడా లేకుండా అందరూ ఒకేసారి మాయమవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.అధికారుల ఈ ఘోర నిర్లక్ష్యంపై స్థానిక ప్రజలు, అర్జీదారులు తీవ్ర విస్మయం వ్యక్తం చేస్తున్నారు. గాలికొదిలేసిన ప్రభుత్వ ఆస్తులు, విలువైన పత్రాలు!రంగసముద్రం-2 సచివాలయానికి వివిధ పనుల నిమిత్తం వచ్చిన ప్రజలు కార్యాలయం లోపలికి వెళ్లి చూసి ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.ఆఫీస్ తలుపులు బార్లా తెరిచి ఉన్నాయి.లోపల లక్షలాది రూపాయల విలువైన కంప్యూటర్ సిస్టమ్స్,ప్రింటర్లు,హై-ఎండ్ స్కానర్లు ఆన్‌లోనే ఉన్నాయి. అంతకంటే ముఖ్యంగా ఎంతోమంది ప్రజలకు సంబంధించిన భూమి రికార్డులు,ఆధార్,రేషన్ కార్డుల వివరాలు,సర్టిఫికేట్లు వంటి అత్యంత విలువైన ప్రభుత్వ డాక్యుమెంట్లు టేబుళ్లపై అలాగే పడి ఉన్నాయి. కనీసం సచివాలయానికి కాపలాగా ఉండాల్సిన వాచ్‌మన్ లేదా అటెండర్ కూడా అక్కడ లేకపోవడం గమనార్హం. ఎవరైనా లోపలికి వచ్చి విలువైన వస్తువులను దొంగిలించినా, లేదా కీలకమైన పత్రాలను తారుమారు చేసినా దానికి బాధ్యులు ఎవరనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.ప్రభుత్వ ఆస్తుల పట్ల, ప్రజల వ్యక్తిగత సమాచారం పట్ల అధికారులకు ఉన్న బాధ్యత ఇదేనా అంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పడిగాపులు కాస్తున్న ప్రజలు.పట్టించుకోని పాలకులు!

దూరప్రాంతాల నుండి వివిధ ధృవీకరణ పత్రాలు,పెన్షన్లు, ఇతర ప్రభుత్వ సేవల కోసం ఆశగా వచ్చిన అర్జీదారులు గంటల తరబడి సచివాలయం బయట,లోపల పడిగాపులు కాశారు.ఒక పక్క ప్రభుత్వాలు సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజల వద్దకే సేవలు అందిస్తున్నామని గొప్పలు చెబుతుంటే, క్షేత్రస్థాయిలో మాత్రం అధికారులు ఇలా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. బల్లలపై ఫైళ్లను, కుర్చీలను చూస్తూ ప్రజలు “అధికారులు ఎక్కడికి పోయారు?”అని ఒకరినొకరు ప్రశ్నించుకుంటూ ఆలోచనలో పడిపోయారు.

నిఘా లోపించిందా? చర్యలు కరువయ్యాయా?

కార్యాలయ పనివేళల్లో సిబ్బంది మొత్తం ఒకేసారి సీట్లలో లేకుండా వెళ్లడం వెనుక ఉన్న మతలబు ఏంటనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.పైఅధికారుల పర్యవేక్షణ లోపం వల్లే కింది స్థాయి సిబ్బంది ఇంతలా బరితెగిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. బయోమెట్రిక్ హాజరు వేసి సిబ్బంది తమ సొంత పనులకు చెక్కేసారా? లేక విధులకు ఎగనామం పెట్టారా? అనే కోణంలో ఉన్నతాధికారులు దర్యాప్తు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.ఉన్నతాధికారులు స్పందించాలి.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలి!ఈ ఘటనపై పోరుమామిళ్ల మండల ఉన్నతాధికారులు  తక్షణమే స్పందించాలని రంగసముద్రం గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇంతటి నిర్లక్ష్యానికి కారణమైన రంగసముద్రం-2 సచివాలయ కార్యదర్శి, డిజిటల్ అసిస్టెంట్ మరియు ఇతర సిబ్బందిపై కఠినమైన శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు. ఒక ప్రభుత్వ కార్యాలయాన్ని ఇంతలా అనాథగా వదిలేయడం క్షమించరాని నేరమని, దీనిపై సమగ్ర విచారణ జరపాలని ప్రజలు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.