పోరుమామిళ్లలో వైఎస్సార్‌సీపీ ‘నామినేషన్’హోరు:సర్పంచ్ అభ్యర్థిగా షేక్ అర్షియా.భారీ ర్యాలీగా తరలివచ్చిన నేతలు,జనం

పోరుమామిళ్ల నవంబర్ 18ప్రజావాణి  బద్వేల్ నియోజకవర్గంలోని ప్రముఖ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్రమైన పోరుమామిళ్ల టౌన్ మేజర్ పంచాయతీ ఎన్నికల వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.పోరుమామిళ్ల మేజర్ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా వైఎస్సార్‌సీపీ తరఫున షేక్ అర్షియా బుధవారం అత్యంత వైభవంగా,భారీ జనసందోహం మధ్య తన నామినేషన్‌ను దాఖలు చేశారు.పార్టీ శ్రేణులు,ప్రజాప్రతినిధులు, ప్రజల అపూర్వ మద్దతుతో ఈ కార్యక్రమం ఒక పండుగలా సాగింది.కార్యాలయం నుంచి పంచాయతీ వరకు ‘జన జాతర’సర్పంచ్ అభ్యర్థి షేక్ అర్షియా గారి నామినేషన్ కార్యక్రమాన్ని పురస్కరించుకుని పోరుమామిళ్లలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...