వేలేరులో పింఛన్ల పండుగ.. 81 మందికి నూతన ఆసరా పింఛన్లు

**వేలేరులో పింఛన్ల పండుగ.. 81 మందికి నూతన ఆసరా పింఛన్లు!** వేలేరు, నవంబర్ 18: హామీని నిలబెట్టుకుంటూ పేదలకు ఆర్థిక భరోసా కల్పించే దిశగా ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. హనుమకొండ జిల్లా వేలేరు మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో 81 నూతన ఆసరా పింఛన్లు మంజూరు కావడంతో లబ్ధిదారుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఈ సందర్భంగా వేలేరు మేజర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ బిల్లా యాదగిరి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క, స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించి కృతజ్ఞతలు...