మధుర తండాలో నూతన చేయూత పెన్షన్ల పంపిణీ చేసిన సర్పంచ్ అనిత మోహన్
మన ప్రజావాణి జుక్కల్ ఆర్ సి ప్రతినిధి నవంబర్ 18
కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని మధుర తండా గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన చేయూత పెన్షన్లు 10మందికి మంజూరయ్యాయి. గ్రామంలో మొత్తం 15 మంది పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకోగా,వారిలో 10మందికి ప్రభుత్వం పెన్షన్లు మంజూరు చేసింది. మంజూరైన పెన్షన్ పత్రాలను బుధవారం గ్రామపంచాయతీ ఆవరణలో గ్రామ సర్పంచ్ అనిత మోహన్ చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిపిఓ లలిత, పంచాయతీ కార్యదర్శి వార్డు నెంబర్లు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్ పత్రాలను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అర్హులైన పేదలకు ప్రభుత్వం అందిస్తున్న చేయూత పెన్షన్లు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు.

