మధుర తండాలో నూతన చేయూత పెన్షన్ల పంపిణీ చేసిన సర్పంచ్ అనిత మోహన్

మధుర తండాలో నూతన చేయూత పెన్షన్ల పంపిణీ చేసిన సర్పంచ్ అనిత మోహన్ మన ప్రజావాణి జుక్కల్ ఆర్ సి ప్రతినిధి నవంబర్ 18 కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని మధుర తండా గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన చేయూత పెన్షన్లు 10మందికి మంజూరయ్యాయి. గ్రామంలో మొత్తం 15 మంది పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకోగా,వారిలో 10మందికి ప్రభుత్వం పెన్షన్లు మంజూరు చేసింది. మంజూరైన పెన్షన్ పత్రాలను బుధవారం గ్రామపంచాయతీ ఆవరణలో గ్రామ సర్పంచ్ అనిత మోహన్ చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు....