📄 ePaper
5pm
7pm
Tuesday, November 17, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణడ్రగ్స్, సైబర్ నేరాలపై పోలీసుల అవగాహన

డ్రగ్స్, సైబర్ నేరాలపై పోలీసుల అవగాహన

📰 Generate e-Paper Clip

డ్రగ్స్, సైబర్ నేరాలపై పోలీసుల అవగాహన
యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి.. సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి
దండేపల్లి, నవంబర్ 17 (ప్రజావాణి):
దండేపల్లి మండల కేంద్రంలో మాదకద్రవ్యాల వినియోగం, సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీస్ సిబ్బంది స్థానిక యువతకు, గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలు, యువత భవిష్యత్తుపై పడే ప్రభావం, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాల్సిన ఆవశ్యకతను వివరించారు.
అలాగే సైబర్ నేరగాళ్లు వివిధ మార్గాల్లో ప్రజలను మోసం చేస్తున్న తీరును తెలియజేస్తూ, అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, సందేశాలు, అనుమానాస్పద లింకుల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. బ్యాంకు ఖాతా వివరాలు, ఓటీపీ, వ్యక్తిగత సమాచారాన్ని ఎవరికీ వెల్లడించవద్దని తెలిపారు. సైబర్ మోసానికి గురైన వెంటనే 1930 హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు.
యువత చెడు వ్యసనాలకు బానిస కాకుండా మంచి మార్గంలో నడుస్తూ, సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలని పోలీసులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది జైవంతు, సోన్, తిరుపతి, నరేందర్‌తో పాటు స్థానిక యువత, గ్రామస్తులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.