బద్దం నరసింహారెడ్డి, మల్లికార్జున్ రెడ్డి చేతుల మీదుగా చేయూత పెన్షన్ల మంజూరు పత్రాల పంపిణీ

ఘట్‌కేసర్, నవంబర్ 16: మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ (ఎంఎంసీ) ఘట్‌కేసర్ సర్కిల్ పరిధిలోని పోచారం 8వ డివిజన్‌లో నూతనంగా మంజూరైన చేయూత ఆసరా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. పోచారం డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కర్ర రాజేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి బద్దం నరసింహారెడ్డి, కాంగ్రెస్ నాయకులు మల్లికార్జున్ రెడ్డి ముఖ్యంగా పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్ మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అర్హులైన పేదలు, వృద్ధులకు ఆర్థిక భరోసా...