📄 ePaper
5pm
7pm
Tuesday, November 17, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeఆంధ్రప్రదేశ్పదవుల కోసం కాదు,ప్రాణాలు నిలబెట్టడం కోసమే మా ప్రయాణం”సామాజిక సేవకు దక్కిన అరుదైన గౌరవం –...

పదవుల కోసం కాదు,ప్రాణాలు నిలబెట్టడం కోసమే మా ప్రయాణం”సామాజిక సేవకు దక్కిన అరుదైన గౌరవం – రామ్ వేమిరెడ్డికి జాతీయ స్థాయి పురస్కారం

📰 Generate e-Paper Clip

కాశినాయన మండలం ఆనువారిపల్లి నవంబర్ 16 (ప్రజావాణి) సమాజంలో ఆపదలో ఉన్నవారికి అండగా నిలబడటమే నిజమైన మానవత్వం.ఆ మానవత్వాన్ని ఆచరణలో చూపిస్తూ, నిస్వార్థంగా రక్తదాన శిబిరాలను నిర్వహిస్తూ ఎంతోమంది ప్రాణాలను కాపాడుతున్న మేము ఉన్నాం సేవాసమితి’ నిర్వాహకులు రామ్ వేమిరెడ్డి కి ప్రతిష్టాత్మక పురస్కారం లభించింది. ఆయన అందిస్తున్న అవిశ్రాంత సామాజిక సేవలను గుర్తించిన ఆల్ ఇండియా ఎన్జీవోస్ అసోసియేషన్ మరియు కేబీఆర్ ఫౌండేషన్ బాలరాజు సంయుక్తంగా ఆయనకు ఈ విశిష్ట పురస్కారాన్ని అందజేసి ఘనంగా సత్కరించాయి.ప్రాణదానాన్ని మించిన మహాదానం మరొకటి లేదు.ఆపదలో ఉన్నవారి కన్నీరు తుడిచే ప్రతి చేయి దైవంతో సమానం.అన్న సూక్తిని నిజం చేస్తూ రామ్ వేమిరెడ్డి గారు తమ సేవా ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు.

700 మందికి పైగా ప్రాణదానం చేసిన సేవాసమితి:

ఆనువారిపల్లి కేంద్రంగా పనిచేస్తున్న‘మేము ఉన్నాం సేవాసమితి’ద్వారా రామ్ వేమిరెడ్డి గారు ఇప్పటివరకు అత్యవసర పరిస్థితుల్లో ఉన్న 500 మంది గర్భిణీ స్త్రీలకు, అలాగే ప్రమాదాలు, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న మరో 200 మంది బాధితులకు సకాలంలో రక్తం అందేలా కృషి చేశారు. మారుమూల ప్రాంతాల్లో రక్తం దొరకక ఇబ్బంది పడుతున్న నిరుపేద కుటుంబాలకు ఈ సేవాసమితి ఒక ఆశాకిరణంగా మారింది.పురస్కార స్వీకరణ అనంతరం రామ్ వేమిరెడ్డి భావోద్వేగం:ఈ సందర్భంగా పురస్కారాన్ని అందుకున్న రామ్ వేమిరెడ్డి మాట్లాడుతూ తన ఆనందాన్ని, కృతజ్ఞతలను వ్యక్తం చేశారు.నా సేవలను గుర్తించి ఆల్ ఇండియా ఎన్జీవోస్ అసోసియేషన్ మరియు కేబీఆర్ ఫౌండేషన్ వారు అందించిన ఈ పురస్కారం నాకు ఎంతో గర్వకారణం, ఎనలేని ఆనందాన్ని ఇచ్చింది.అయితే,ఈ గౌరవం కేవలం నా ఒక్కడిది మాత్రమే కాదు ఆపద సమయాల్లో పిలవగానే స్పందించి రక్తదానానికి ముందుకొచ్చిన ప్రతి రక్తదాతది, మా సేవా కార్యక్రమాలకు వెన్నుదన్నుగా నిలిచి సహకరించిన ప్రతి ఒక్కరిది”అని పేర్కొన్నారు.భవిష్యత్ ప్రణాళికలు,నిరంతర సేవా సంకల్పం:”పదవుల కోసం, ప్రచారం కోసం కాదు,కేవలం ప్రాణాలు నిలబెట్టడం కోసమే మా ఈ ప్రయాణం. మీ అందరి ఆశీస్సులు, సహకారంతో ‘మేము ఉన్నాం సేవాసమితి’ రానున్న రోజుల్లో మరిన్ని విస్తృతమైన సేవా కార్యక్రమాలు చేపడుతూ, సమాజ హితం కోసం నిరంతరం ముందుకు సాగుతుంది”అని ఆయన స్పష్టం చేశారు.ఈ సందర్భంగా తనకు సహకరించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.రామ్ వేమిరెడ్డి కి ఈ ప్రతిష్టాత్మక పురస్కారం లభించడంపై ఆనువారిపల్లి గ్రామస్తులు, యువత, పలువురు సామాజిక వేత్తలు, శ్రేయోభిలాషులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలియజేశారు. ఆయన సేవలు మరిన్ని తరాలకు ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.