పదవుల కోసం కాదు,ప్రాణాలు నిలబెట్టడం కోసమే మా ప్రయాణం”సామాజిక సేవకు దక్కిన అరుదైన గౌరవం – రామ్ వేమిరెడ్డికి జాతీయ స్థాయి పురస్కారం

కాశినాయన మండలం ఆనువారిపల్లి నవంబర్ 16 (ప్రజావాణి) సమాజంలో ఆపదలో ఉన్నవారికి అండగా నిలబడటమే నిజమైన మానవత్వం.ఆ మానవత్వాన్ని ఆచరణలో చూపిస్తూ, నిస్వార్థంగా రక్తదాన శిబిరాలను నిర్వహిస్తూ ఎంతోమంది ప్రాణాలను కాపాడుతున్న మేము ఉన్నాం సేవాసమితి’ నిర్వాహకులు రామ్ వేమిరెడ్డి కి ప్రతిష్టాత్మక పురస్కారం లభించింది. ఆయన అందిస్తున్న అవిశ్రాంత సామాజిక సేవలను గుర్తించిన ఆల్ ఇండియా ఎన్జీవోస్ అసోసియేషన్ మరియు కేబీఆర్ ఫౌండేషన్ బాలరాజు సంయుక్తంగా ఆయనకు ఈ విశిష్ట పురస్కారాన్ని అందజేసి ఘనంగా సత్కరించాయి.ప్రాణదానాన్ని మించిన మహాదానం మరొకటి లేదు.ఆపదలో ఉన్నవారి...