📄 ePaper
5pm
7pm
Tuesday, November 17, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణబీఆర్ఎస్ నాయకుల అక్రమ అరెస్టులు అన్యాయం.. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

బీఆర్ఎస్ నాయకుల అక్రమ అరెస్టులు అన్యాయం.. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

📰 Generate e-Paper Clip

బీఆర్ఎస్ నాయకుల అక్రమ అరెస్టులు అన్యాయం.. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 16 (ప్రజావాణి): పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులను అక్రమంగా అరెస్టు చేయడం దుర్మార్గమని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మండిపడ్డారు. ప్రభుత్వ తీరును తీవ్రంగా సోమవారం ఒక ప్రకటన లో ఖండిస్తున్నామని తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పాలన గాలికి వదిలి అరెస్టులు, అక్రమ కేసులు, ముందస్తు నిర్బంధాలు విధిస్తూ రాజకీయ కక్ష తీర్చుకోవడం సిగ్గుచేటని అన్నారు. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా పోలీసులతో అణిచివేయాలని చూడటం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని విమర్శించారు.

తొర్రూరు పట్టణంలో కేసీఆర్ హయాంలో నిర్మించిన 280 డబుల్ బెడ్ రూం ఇండ్లు అర్హులకు కాకుండా కమిషన్ ఇచ్చిన వారికి కేటాయించి, అసలైన లబ్ధిదారులకు అందించకుండా ప్రభుత్వం పేదలను మోసం చేస్తోందని ఆరోపించారు. నిజమైన అర్హులకు ఇండ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తే అరెస్టులు చేస్తారా అని ప్రశ్నించారు.

అర్హులైన లబ్ధిదారుల ఎంపిక లిస్టును బీఆర్ఎస్ కౌన్సిలర్లకు అందజేయకుండా, వారిని ఉదయం 3 గంటల నుంచి అక్రమ అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్‌లో పెట్టడమే మీ ఇందిరమ్మ రాజ్యమా అని నిలదీశారు.

ప్రశ్నించే గొంతులను అక్రమ అరెస్టులు, కేసులు, నిర్బంధాలతో అణిచివేయలేరని అన్నారు. మీ బెదిరింపులకు బీఆర్ఎస్ పార్టీ భయపడదని స్పష్టం చేశారు. ప్రజాక్షేత్రంలోనే మిమ్మల్ని ఎండగడతామని హెచ్చరించారు. ప్రజల తరఫున నిలదీస్తూనే ఉంటామని, పేదల హక్కుల కోసం పోరాడుతూనే ఉంటామని తెలిపారు.

అరెస్టు చేసిన బీఆర్ఎస్ నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే తొర్రూరు పోలీస్ స్టేషన్‌ను బీఆర్ఎస్ నాయకులతో కలిసి ముట్టడిస్తామని హెచ్చరించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.