*పోతుగల్ లో బీరప్ప గుడికి రూ. 1లక్ష విరాళం అందజేసిన మాజీ జడ్పిటిసి పట్నం అవినాష్ రెడ్డి*
షాబాద్ న్యూస్ 16(మన ప్రజావాని )
షాబాద్ మండలంలోని పోతుగల్ గ్రామంలో బీరప్ప గుడికి షాబాద్ మాజీ జడ్పిటిసి పట్నం అవినాష్ రెడ్డి తన వంతు సహాయంగా రూ .1లక్ష విరాళం అందజేశారు.
సోమవారం షాబాద్ మండల పరిధిలోని పోతుగల్ గ్రామంలో బీరప్ప ఆలయంలో విగ్రహ ప్రతిష్ట పూజల్లో పాల్గొన్నారు. అనంతరం తన వంతుగా విరాళం అందజేశారు. గ్రామ పెద్దలు అవినాష్ రెడ్డిని శాలువాలతో ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నర్సింహులు, గ్రామస్తులు యాదయ్య యాదవ్, మల్లేష్ యాదవ్, వెంకటేష్, మునీర్, రాజు నాయక్ శ్రీధర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

