📄 ePaper
5pm
7pm
Monday, November 16, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణజాతీయ, రాష్ట్ర స్థాయిలో పటాన్‌చెరు జర్నలిస్టులకు కీలక బాధ్యతలు

జాతీయ, రాష్ట్ర స్థాయిలో పటాన్‌చెరు జర్నలిస్టులకు కీలక బాధ్యతలు

📰 Generate e-Paper Clip

జాతీయ, రాష్ట్ర స్థాయిలో పటాన్‌చెరు జర్నలిస్టులకు కీలక బాధ్యతలు

టీయూడబ్ల్యూజే హెచ్-143 జాతీయ, రాష్ట్ర కౌన్సిళ్లకు నలుగురు ఎంపిక

పటాన్‌చెరు, నవంబర్ 16 (ప్రజావాణి): తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే హెచ్-143) జాతీయ, రాష్ట్ర కౌన్సిళ్లకు పటాన్‌చెరు నియోజకవర్గానికి చెందిన నలుగురు జర్నలిస్టులు ఎంపికయ్యారు. ఇటీవల నిర్వహించిన ఎన్నికల్లో వివిధ హోదాలకు వారు ఎన్నికైనట్లు యూనియన్ ఉమ్మడి మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శి యాదగిరి గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు.జాతీయ కౌన్సిల్ సభ్యులుగా సీనియర్ జర్నలిస్టులు ఆనంద్ కుమార్, ప్రమోద్ కుమార్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా వడ్ల శ్రీధర్, కొంక రాజ్ కిషోర్ బాబు ఎంపికయ్యారని వెల్లడించారు. నూతనంగా ఎన్నికైన కౌన్సిల్ సభ్యులు జర్నలిస్టుల హక్కుల సాధనలో కీలక పాత్ర పోషించాలని ఆయన ఆకాంక్షించారు.పటాన్‌చెరు నియోజకవర్గ జర్నలిస్టులకు జాతీయ, రాష్ట్ర స్థాయిలో ప్రాతినిధ్యం కల్పించడంపై యూనియన్ పటాన్‌చెరు నియోజకవర్గ అధ్యక్షుడు రాఘవరెడ్డి, ప్రధాన కార్యదర్శి అంతారం మహేష్ గౌడ్, టెంజు అధ్యక్షుడు శేఖర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి రామకృష్ణ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నూతన కౌన్సిల్ సభ్యులకు శుభాకాంక్షలు తెలుపుతూ రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కౌన్సిల్ సభ్యులు మాట్లాడుతూ తమపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తామని తెలిపారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం, హక్కుల పరిరక్షణ, సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తామని పేర్కొన్నారు. జర్నలిస్టులందరినీ ఐక్యంగా ముందుకు తీసుకెళ్తూ యూనియన్ బలోపేతానికి తమ వంతు కృషి చేస్తామని స్పష్టం చేశారు.తమ ఎంపికకు సహకరించిన రాష్ట్ర అధ్యక్షుడు, ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణ, ప్రధాన కార్యదర్శి మారుతి సాగర్, టెంజు రాష్ట్ర అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.