📄 ePaper
5pm
7pm
Tuesday, November 17, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణనెల్లుట్లలో అయ్యప్ప పూజా కార్యక్రమంలో పాల్గొన్న డీసీసీ వైస్ ప్రెసిడెంట్ వంశీధర్ రెడ్డి

నెల్లుట్లలో అయ్యప్ప పూజా కార్యక్రమంలో పాల్గొన్న డీసీసీ వైస్ ప్రెసిడెంట్ వంశీధర్ రెడ్డి

📰 Generate e-Paper Clip

నెల్లుట్లలో అయ్యప్ప పూజా కార్యక్రమంలో పాల్గొన్న డీసీసీ వైస్ ప్రెసిడెంట్ వంశీధర్ రెడ్డి

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 16 (ప్రజావాణి): జిల్లా లోని లింగాల గణపురం మండలం, నెల్లుట్ల గ్రామంలో సోమవారం డీసీసీ వైస్ ప్రెసిడెంట్, మాజీ జెడ్పిటిసి సభ్యులు గుడి వంశీధర్ రెడ్డి పర్యటించారు.

అయ్యప్ప మాల ధరించిన కొత్తకొండ గంగాధర్ కన్నె స్వామి వారి స్వగృహంలో గుర్రం బాలరాజు గౌడ్ గురు స్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన అయ్యప్ప పూజా కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులతో కలిసి అయ్యప్ప స్వామి భజనలో పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన భిక్షను స్వీకరించారు.

ఈ సందర్భంగా వంశీధర్ రెడ్డి మాట్లాడుతూ, అయ్యప్ప స్వామి దీక్ష ఎంతో నిష్ఠతో, భక్తి శ్రద్ధలతో చేసే దీక్ష అని, కన్నె స్వాములకు అందరూ సహకారం అందించాలని కోరారు. గ్రామంలో భక్తి భావం, ఐక్యత ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు. గంగాధర్ కన్నె స్వామి దీక్ష విజయవంతంగా పూర్తి చేసుకోవాలని ఆశీర్వదించారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ కొల్లూరు శివకుమార్, జిల్లా కార్యదర్శి బొల్లంపల్లి నాగేందర్, ప్యాక్స్ డైరెక్టర్ గుర్రం బాలరాజు, మండల ప్రధాన కార్యదర్శి బత్తిని అశోక్ కుమార్ గౌడ్, మాజీ సర్పంచ్ దూసరి గణపతి, గ్రామ శాఖ అధ్యక్షుడు మాచర్ల మహేందర్ గౌడ్, మాజీ ఎంపీటీసీ గుర్రం యాదగిరి, బోయిని రాజు గౌడ్, బుశిగంపల ఆంజనేయులు గౌడ్, జీడికల్ గ్రామశాఖ అధ్యక్షుడు దేవరాయ రాజు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.