📄 ePaper
Epaper 2
Monday, November 16, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణఇందిరమ్మ ఇళ్లతో పేదల సొంతింటి కల సాకారం

ఇందిరమ్మ ఇళ్లతో పేదల సొంతింటి కల సాకారం

📰 Generate e-Paper Clip

ఇందిరమ్మ ఇళ్లతో పేదల సొంతింటి కల సాకారం

పాక్స్ చైర్మన్ ఒగ్గు దామోదర్

బెజ్జంకి,నవంబర్ 16(ప్రజావాణి)

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని తలారివానిపల్లె గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు రాజు శంకరమ్మ,మహేందర్ నూతన గృహ నిర్మాణాలకు నిర్వహించిన భూమిపూజ కార్యక్రమంలో పాక్స్ చైర్మన్ ఒగ్గు దామోదర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజాపాలనలో భాగంగా సన్నబియ్యం పంపిణీ, ఉచిత విద్యుత్, ఉచిత బస్సు ప్రయాణం, రేషన్ కార్డులు, నూతన పింఛన్లు వంటి సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు లింగాల శ్రీనివాస్, సర్పంచ్ గండికోట సురేష్, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు గూడెల్లి శ్రీకాంత్, డైరెక్టర్ బైర సంతోష్, పోతిరెడ్డి మధుసూదన్ రెడ్డి, అధికార ప్రతినిధి జెల్ల ప్రభాకర్, రావుల నర్సయ్య, అమర్ రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షుడు పబ్బతి తిరుపతి, దొమ్మటి శ్రీహరి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.