📄 ePaper
5pm
7pm
Monday, November 16, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణఆశా వర్కర్ల పోరాటానికి బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు

ఆశా వర్కర్ల పోరాటానికి బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు

📰 Generate e-Paper Clip

ఆశా వర్కర్ల పోరాటానికి బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు

వారి న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి

టి ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షురాలు
సిరవేన స్వప్న

ప్రజావాణి జిల్లా ప్రతినిధి
పెద్దపల్లి నవంబర్ 16

కలెక్టరేట్ ఎదుట ఆశా వర్కర్ల ధర్నాకు మద్దతు తెలిపిన
టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు సిరవేణి స్వప్న ఆశా వర్కర్ల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆశా వర్కర్లు నిర్వహించిన ధర్నాకు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు సిరవేణి స్వప్న మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆశా వర్కర్లు తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే నెరవేర్చాలని నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు.

ధర్నా కార్యక్రమానికి హాజరైన సిరవేణి స్వప్న ఆశా వర్కర్లకు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో ఆశా వర్కర్లు కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు ఆరోగ్య సేవలు అందించడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ, ఆరోగ్య కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఆశా వర్కర్లు నిరంతరం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.

ఎండనక, వాననక ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న ఆశా వర్కర్ల సమస్యలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం సమంజసం కాదన్నారు. తమ శ్రమకు తగిన గుర్తింపు, గౌరవ వేతనం, ఉద్యోగ భద్రత కల్పించాలనే వారి డిమాండ్లను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి వెంటనే పరిష్కరించాలని కోరారు.

ఆశా వర్కర్లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం తక్షణమే స్పందించాలని, వారి న్యాయమైన పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతుగా నిలుస్తుందని సిరవేణి స్వప్న స్పష్టం చేశారు. ఆశా వర్కర్ల హక్కుల సాధన కోసం తమ పార్టీ తరఫున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు సాగర్ల వాసవి, మల్లికార్జున్, శ్రీకాంత్ తదితర నాయకులు, పార్టీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.