📄 ePaper
5pm
7pm
Tuesday, November 17, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణవేములపల్లి మరియు మాడుగులపల్లి మండలాల నూతన చేయూత పెన్షన్ల మంజూరు

వేములపల్లి మరియు మాడుగులపల్లి మండలాల నూతన చేయూత పెన్షన్ల మంజూరు

📰 Generate e-Paper Clip

-వేములపల్లి మరియు మాడుగులపల్లి మండలాల నూతన చేయూత పెన్షన్ల మంజూరు

-ముఖ్య అతిధులుగా పాల్గొన్న
ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి

ప్రజావాణి మిర్యాలగూడ నియోజకవర్గం నవంబర్ 15

మిర్యాలగూడ నియోజకవర్గం
వేములపల్లి మరియు మాడుగులపల్లి మండలాల నూతన చేయూత పెన్షన్ల మంజూరు ఉత్తర్వుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి
మిర్యాలగూడ నియోజకవర్గంలోని వేములపల్లి & మాడుగుల పల్లి మండలాల నూతన చేయూత పెన్షన్ల మంజూరు ఉత్తర్వుల పంపిణీ కార్యక్రమం సల్కునూరు ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. ఇట్టి కార్యక్రమంలో ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ & ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నూతనంగా మంజూరైన చేయూత పెన్షన్ల ఉత్తర్వులను లబ్ధిదారులకు అందజేశారు. అర్హులైన పేదలకు, వృద్ధులకు, దివ్యాంగులకు సామాజిక భద్రత కల్పించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాడుగుల పల్లి మండల పార్టీ అధ్యక్షులు వేణుగోపాల్ రెడ్డి మరియు వేములపల్లి మండల పార్టీ అధ్యక్షులు రవీందర్ రెడ్డి , మాజీ ఎంపీపీలు వివిధ గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, సంబంధిత అధికారులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.