📄 ePaper
5pm
7pm
Tuesday, November 17, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణభగవాన్ బిర్సా ముండా 151వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ

భగవాన్ బిర్సా ముండా 151వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ

📰 Generate e-Paper Clip

భగవాన్ బిర్సా ముండా 151వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ

ఆదివాసీల హక్కుల కోసం పోరాడిన మహనీయుడు బిర్సా ముండా: మూడవత్ కుమార్ నాయక్

రామాయంపేట, నవంబర్ 15 (ప్రజావాణి ప్రతినిధి: నరేష్ నాయక్):

భగవాన్ బిర్సా ముండా 151వ జయంతి, జనజాతీయ గౌరవ దివస్ వేడుకలను పురస్కరించుకొని మెదక్ జిల్లాలో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మెదక్ జిల్లా ఎస్టీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి మూడవత్ కుమార్ నాయక్ మాట్లాడుతూ, భగవాన్ బిర్సా ముండా ఆదివాసీ సమాజ ఆత్మగౌరవానికి ప్రతీక అని అన్నారు.

ఆదివాసీల హక్కుల పరిరక్షణ, భూమి, అడవి, జల వనరుల కోసం బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఆయన చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని పేర్కొన్నారు. చిన్న వయసులోనే దేశం కోసం, ఆదివాసీ సమాజ అభ్యున్నతి కోసం పోరాడిన ఆయన జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని తెలిపారు.

బిర్సా ముండా ఆశయాలను ఆదర్శంగా తీసుకొని ఆదివాసీ యువత విద్య, ఉద్యోగ, సామాజిక రంగాల్లో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఆయన చేసిన త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఎస్టీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి ఫూల్ సింగ్ నాయక్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రెడ్యా నాయక్, మెదక్ మండల ఎస్టీ మోర్చా అధ్యక్షుడు సురేష్ నాయక్, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొని భగవాన్ బిర్సా ముండా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.