📄 ePaper
5pm
7pm
Tuesday, November 17, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeఎడిటోరియల్ప్రభుత్వ భూమిని కబ్జా నుంచి కాపాడండి

ప్రభుత్వ భూమిని కబ్జా నుంచి కాపాడండి

📰 Generate e-Paper Clip

మేడ్చల్: మేడ్చల్ రెవిన్యూ సర్వే నెంబర్ 66లో ఉన్న ప్రభుత్వ భూమిని కబ్జా నుంచి కాపాడాలని కోరుతూ చెరువుకొమ్ము శ్రీనివాస్ గౌడ్ వివిధ కుల సంఘాల ప్రతినిధులతో కలిసి మేడ్చల్ ఎమ్మార్వోకు వినతిపత్రం సమర్పించారు. మేడ్చల్‌లోని టీటీడీ కళ్యాణ మండపం, సీఎంఆర్ షాపింగ్ మాల్ వెనుక భాగంలో ఉన్న ప్రభుత్వ భూమిని అక్రమంగా కబ్జా చేసి షెడ్డు నిర్మించారని వారు ఆరోపించారు. డబిల్‌పూర్‌కు చెందిన రాజమల్లా రెడ్డి ఈ స్థలాన్ని దారి పేరుతో ఆక్రమించి నిర్మాణం చేపట్టారని వినతిపత్రంలో పేర్కొన్నారు.
రెవిన్యూ సర్వే నెంబర్ 66లో గతంలో కుంట, కుంటకట్టగా ఉన్న ప్రభుత్వ భూమిని టీటీడీ తిరుపతి దేవస్థానం అభివృద్ధి కార్యక్రమాల నిమిత్తం కేటాయించినట్లు వారు తెలిపారు. టీటీడీ అధికారులు తమకు అనుకూలంగా ఉన్న కొంత భూమి వరకు ప్రహరీ గోడ నిర్మించగా, మిగిలిన స్థలం ఖాళీగా ఉందని పేర్కొన్నారు.
ఈ ఖాళీ స్థలాన్ని పక్కనే ఉన్న భవన యజమాని దారి పేరుతో కబ్జా చేసి షెడ్డు నిర్మించారని ఆరోపించారు. ఈ విషయంపై అధికారులు వెంటనే స్పందించి స్థలాన్ని సమగ్రంగా సర్వే చేయాలని, ప్రభుత్వ భూమి హద్దులను నిర్ధారించాలని డిమాండ్ చేశారు.
అనంతరం ప్రభుత్వ భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవాలని కోరారు. కబ్జా జరిగినట్లు విచారణలో తేలితే సంబంధిత వ్యక్తులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మార్వోకు సమర్పించిన వినతిపత్రంలో డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ కుల సంఘాల ప్రతినిధులతో పాటు కుమ్మరి లింగం, సత్తయ్య, బాలు, ఒగ్గు భాస్కర్, నర్సింహ, ఎల్.వి. శైలేందర్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.