📄 ePaper
5pm
7pm
Friday, November 20, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeఆంధ్రప్రదేశ్నిండలి గ్రామంలో వీధికుక్కల స్వైరవిహారం చిన్నారిపై పిచ్చికుక్క దాడి!

నిండలి గ్రామంలో వీధికుక్కల స్వైరవిహారం చిన్నారిపై పిచ్చికుక్క దాడి!

📰 Generate e-Paper Clip

పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోని పంచాయతీ అధికారులు.పందులు,కుక్కల సంచారంతో ప్రజల్లో భయాందోళనలు.

నెల్లూరుఎపిబ్యూరో నవంబర్15(ప్రజావాణి ):బాలాయపల్లి మండలం నిండలి గ్రామంలో వీధికుక్కలు,పందుల బెడద రోజురోజుకూ పెరుగుతోంది. గ్రామంలోని పలు ప్రాంతాల్లో పందులు,కుక్కలు గుంపులుగా సంచరిస్తుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా ఓ పిచ్చికుక్క చిన్నారిపై దాడి చేసి కరవడంతో గ్రామంలో ఆందోళన నెలకొంది.గ్రామంలో వీధికుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయని,వాటి వల్ల చిన్నారులు,వృద్ధులు బయటకు రావాలంటేనే భయపడుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.కుక్కల బెడదతో పాటు పందుల సంచారం కూడా ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. ఈ సమస్యపై తలారి దట్టం అరవింద్ పలుమార్లు పంచాయతీ కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.నేడు చిన్నారిపై పిచ్చికుక్క దాడి జరగడంతో గ్రామస్తులు మరింత ఆందోళన చెందుతున్నారు.ఆ కుక్క మరెంతమందిని కరిచిందో, గ్రామంలో ఇంకా ఎన్ని కుక్కలు ఇలాంటి ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నాయో తెలియని పరిస్థితి నెలకొంది. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని గ్రామస్తులు విమర్శిస్తున్నారు. ఇంకెంతమంది బాధితులైతే స్పందిస్తారు?చిన్నారిపై కుక్క దాడి జరిగిన తర్వాతైనా అధికారులు మేల్కొనాలని ప్రజలు కోరుతున్నారు.గ్రామంలోని వీధికుక్కలను నియంత్రించడంతో పాటుపందుల బెడదనుతొలగించేందుకుతక్షణచర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.ముఖ్యంగా చిన్నారులు,మహిళలు,వృద్ధుల భద్రతను దృష్టిలోఉంచుకొనిపంచాయతీ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.ఇప్పటికైనా పంచాయతీ కార్యదర్శి,సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి నిండలి గ్రామంలో కుక్కలు,పందుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని గ్రామస్తులు కోరుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.