📄 ePaper
Epaper 2
Saturday, November 14, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణమహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తే చట్ట పరంగా చర్యలు

మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తే చట్ట పరంగా చర్యలు

📰 Generate e-Paper Clip

మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తే చట్ట పరంగా చర్యలు

మద్దూరు బాల గ్రామ సభలో సర్పంచ్ దామెర మల్లేశం

మద్దూరు నవంబర్14, ప్రజా వాణి,

ఎవరైనా మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తే చట్ట పరంగా చర్యలు తప్పవని మద్దూరు గ్రామ సర్పంచ్ దామెర మల్లేశం అన్నారు. నెహ్రూ జయంతి సందర్భంగా గ్రామ పంచాయతీ ఆవరణలో బాల గ్రామ సభ సర్పంచ్ దామెర మల్లేశం అధ్యక్షతన నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాల గ్రామ సభ ముఖ్య ఉద్దేశ్యం బాలికలు అన్ని రంగాల్లో అభివృద్ది చెందాలని కోరారు.అందుకు నా సహాయ సహకారాలు ఎల్లవేళల ఉంటాయన్నారు.బాలికలు నెహ్రూ జీవిత చరిత్రను ఇంగ్లీషులో ధారాళంగా మాట్లాడడం పట్ల సర్పంచ్ అభినందించారు.ఇదే విధంగా రానున్న రోజుల్లో బాలలు ఎదిగి దేశానికి ఒక జాన్సీ రాణి,రాణీ రుద్రమదేవి లాగ సేవలు అందించాలని ఆయన కోరారు. అనంతరం బాలలతో ప్రతిజ్ఞ చేయించారు. స్పీచ్ లో ప్రతిభ కనబరిచిన కస్తూర్బా, ఉన్నత పాఠశాల, సి పి ఎస్ పాఠశాల విద్యార్థులకు సర్పంచ్ మల్లేశం, ఉప సర్పంచ్ షేకిల్, వార్డు సభ్యుల చేతుల మీదుగా బహుమతులు అందించారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మహమ్మద్ షాకిల్, గ్రామ పంచాయతీ కార్యదర్శి అశోక్, వార్డు సభ్యులు, ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు, అంగన్వాడి, ఆశా కార్యకర్తలు,విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.