📄 ePaper
Epaper 2
Saturday, November 14, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణకుల వివక్షకు తావులేకుండా సామాజిక ఐక్యతను చాటాలి!

కుల వివక్షకు తావులేకుండా సామాజిక ఐక్యతను చాటాలి!

📰 Generate e-Paper Clip

కుల వివక్షకు తావులేకుండా సామాజిక ఐక్యతను చాటాలి!

ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలంతా ఐక్యంగా ముందుకు సాగాలి

పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పిలుపు

ప్రజావాణి జిల్లా ప్రతినిధి
పెద్దపల్లి నవంబర్ 14

పెద్దపల్లి: కులాల పేరుతో సమాజాన్ని విభజిస్తూ, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాల మధ్య చిచ్చుపెట్టేందుకు జరుగుతున్న కుట్రలకు ఎవరూ బలికావద్దని పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు డాక్టర్ గడ్డం వంశీకృష్ణ పిలుపునిచ్చారు. కుల, మత, వర్గ భేదాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఐకమత్యంతో ఉంటూ సమాజ అభివృద్ధికి కృషి చేయాలని ఆయన ఆకాంక్షించారు.

గతంలో కాకా వెంకటస్వామి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీతో పాటు బడుగు, బలహీన వర్గాల ప్రజలందరినీ ఒకే వేదికపైకి తీసుకువచ్చేందుకు విశేష కృషి చేశారని ఎంపీ గుర్తుచేశారు. ఆయన ఆశయాలు, సేవలను స్ఫూర్తిగా తీసుకొని తాను కూడా అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని ముందుకు సాగుతానని స్పష్టం చేశారు. సమాజంలో సమానత్వం, సామాజిక న్యాయం సాధించాలంటే అన్ని వర్గాల మధ్య ఐక్యత ఎంతో అవసరమని పేర్కొన్నారు.

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 14, 15, 17, 21 ద్వారా ప్రతి పౌరుడికి సమానత్వపు హక్కు, వివక్ష నుంచి రక్షణ, అంటరానితనం నిర్మూలన, జీవించే హక్కులను కల్పించారని తెలిపారు. రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను పరిరక్షించుకోవడంతో పాటు సామాజిక న్యాయం, సమానత్వ విలువలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.

కులాల పేరుతో విడిపోకుండా, పరస్పర గౌరవం, సోదరభావంతో కలిసిమెలిసి ఉండాలని ఎంపీ వంశీకృష్ణ కోరారు. స్వార్థ రాజకీయాల కోసం సమాజంలో విభేదాలు సృష్టించే ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టాలని, విభజన రాజకీయాలకు దూరంగా ఉంటూ బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి సమష్టిగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.