📄 ePaper
Epaper 2
Sunday, November 15, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణప్రపంచ డయాబెటిస్ దినోత్సవం సందర్భంగా ఉచిత రక్త పరీక్షలు మరియు అవగాహన సదస్సు

ప్రపంచ డయాబెటిస్ దినోత్సవం సందర్భంగా ఉచిత రక్త పరీక్షలు మరియు అవగాహన సదస్సు

📰 Generate e-Paper Clip

కడప : ప్రజావాణి నవంబర్ (14)
ప్రపంచ డయాబెటిస్ దినోత్సవం సందర్భంగా ఉచిత రక్త పరీక్షలు మరియు అవగాహన సదస్సు.
కడప నగరంలోని ప్రభుత్వ పురుషుల కళాశాల (అటానమస్) జంతుశాస్త్ర విభాగం (DBT స్టార్ కాలేజ్ స్కీమ్), జనవిజ్ఞాన వేదిక మరియు సి.వి. రామన్ సైన్స్ క్లబ్ (కడప డివిజన్) సంయుక్త ఆధ్వర్యంలో ప్రపంచ డయాబెటిస్ దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం ఉదయం 6:00 గంటల నుండి 9:30 గంటల వరకు కళాశాల క్రీడా మైదానంలో మార్నింగ్ వాకర్స్, విద్యార్థులు మరియు నగర ప్రజల కోసం ప్రత్యేక అవగాహన కార్యక్రమం, ఉచిత రక్త పరీక్షల శిబిరం నిర్వహించబడింది.
ఈ కార్యక్రమంలో ప్రముఖ డయాబెటాలజిస్ట్ (షుగర్ వ్యాధి నిపుణులు) డాక్టర్ వారణాసి ప్రతాప్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వైద్య బృందం మార్నింగ్ వాకర్స్‌కు ఉచితంగా రక్తంలో చక్కెర స్థాయిలను (బ్లడ్ షుగర్) పరీక్షించి, తగిన వైద్య సలహాలు అందించారు. ఈ సందర్భంగా డాక్టర్ వారణాసి ప్రతాప్ రెడ్డి గారు మాట్లాడుతూ, “నేటి ఆధునిక జీవనశైలి, ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లోపించడం వల్ల మధుమేహం (డయాబెటిస్) వేగంగా విస్తరిస్తోంది. మధుమేహాన్ని ముందుగానే గుర్తించడం ద్వారా గుండె, కిడ్నీ, కంటి సంబంధిత తీవ్రమైన సమస్యలను నివారించవచ్చు. ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా నడక, వ్యాయామం చేస్తూ, సమతుల్య ఆహారం తీసుకోవాలి. మధుమేహం ఉన్నవారు భయపడకుండా సరైన మందులు, జీవనశైలి మార్పులతో ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపవచ్చు” అని సందేశమిచ్చారు.
కార్యక్రమంలో పాల్గొన్న కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జె. వెంకటలక్ష్మి గారు మాట్లాడుతూ, “సమాజ ఆరోగ్య పరిరక్షణలో విద్యాసంస్థల పాత్ర ఎంతో కీలకం. విద్యార్థులతో పాటు ప్రతిరోజూ కళాశాల మైదానానికి వచ్చే మార్నింగ్ వాకర్స్ మరియు నగర ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు జంతుశాస్త్ర విభాగం, జనవిజ్ఞాన వేదిక, సి.వి. రామన్ సైన్స్ క్లబ్ కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయం. ‘ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుందాం, చురుగ్గా ఉందాం, డయాబెటిస్‌ను జయిద్దాం’ అనే నినాదాన్ని ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో భాగస్వామ్యం చేసుకోవాలి” అని పిలుపునిచ్చారు.
కళాశాల DBT స్టార్ కాలేజ్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ వై. సావిత్రి గారు మాట్లాడుతూ, “భారత ప్రభుత్వ బయోటెక్నాలజీ విభాగం (DBT) సహకారంతో విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడంతో పాటు, సామాజిక ఆరోగ్య కార్యక్రమాలను కూడా నిరంతరం నిర్వహిస్తున్నాము. జంతు శాస్త్ర విభాగధిపతి డా. పి రవిశేఖర్ మాట్లాడుతూ మధుమేహం వంటి జీవనశైలి వ్యాధుల పట్ల ప్రజలకు శాస్త్రీయ అవగాహన కల్పించడం ద్వారా ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించవచ్చని, ఇందులో విద్యార్థులు మరియు స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యం ఎంతో అవసరమని” పేర్కొన్నారు.
సి.వి. రామన్ సైన్స్ క్లబ్ (కడప డివిజన్) అధ్యక్షులు ఆర్. శ్రీనివాసుల రెడ్డి గారు మధుమేహం రావడానికి గల కారణాలు, వ్యాధి లక్షణాలు, నివారణ చర్యలు మరియు నియంత్రణ పద్ధతులపై ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పోస్టర్ మరియు ఫోటో ప్రదర్శన ద్వారా మార్నింగ్ వాకర్స్‌కు, విద్యార్థులకు శాస్త్రీయంగా వివరించారు.
ఈ కార్యక్రమంలో సి.వి. రామన్ సైన్స్ క్లబ్ (కడప డివిజన్) గౌరవ సలహాదారు డాక్టర్ బి. రామచంద్రయ్య, జంతుశాస్త్ర విభాగ అధ్యాపకులు డా. నరసింహరావు, డా హరి ప్రసాద్, జనవిజ్ఞాన వేదిక నగర అధ్యక్షులు వెంకట్రామరాజు, నగర ప్రధాన కార్యదర్శి నరసింహారెడ్డి, పలువురు వాకర్స్ అసోసియేషన్ సభ్యులు, విద్యార్థులు మరియు నగర ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ఇట్లు,
నిర్వాహకులు
జంతుశాస్త్ర విభాగం (ప్రభుత్వ పురుషుల కళాశాల – A, కడప),
జనవిజ్ఞాన వేదిక & సి.వి. రామన్ సైన్స్ క్లబ్ (కడప డివిజన్).

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.