📄 ePaper
Epaper 2
Saturday, November 14, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణప్రజా సమస్యలపై సమరం.. పర్వతగిరిలో బీజేపీ శ్రేణులకు నేతల దిశానిర్దేశం

ప్రజా సమస్యలపై సమరం.. పర్వతగిరిలో బీజేపీ శ్రేణులకు నేతల దిశానిర్దేశం

📰 Generate e-Paper Clip

**ప్రజా సమస్యలపై సమరం.. పర్వతగిరిలో బీజేపీ శ్రేణులకు నేతల దిశానిర్దేశం!**

వరంగల్ జిల్లా, వర్ధన్నపేట నియోజకవర్గంలోని పర్వతగిరి మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల కార్యవర్గ సమావేశం నిర్వహించారు. మండల అధ్యక్షుడు హర్కవత్ వినోద్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్, వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ వన్నాల వెంకటరమణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా నాయకులు పార్టీ నాయకులు, కార్యకర్తలకు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.

క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడానికి ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని సూచించారు. గ్రామస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారం కోసం నిరంతరం కృషి చేయాలని పేర్కొన్నారు.

పార్టీ సిద్ధాంతాలను, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని, రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ముందుకు సాగాలని నాయకులు సూచించారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి బన్న ప్రభాకర్, ఎస్టీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జాటోతు శ్రీనివాస్, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు కుడికాల శ్రీధర్, మండల ఇన్‌చార్జి గుడిపూడి రాధాకృష్ణ, జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ నోముల రతన్, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు ఎర్రగొల్ల భరత్ వీర్, మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.