📄 ePaper
Epaper 2
Saturday, November 14, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణపిల్లల గొంతుకకు గ్రామసభ వేదిక.. వారి భవిష్యత్తుకు అభివృద్ధి బాట

పిల్లల గొంతుకకు గ్రామసభ వేదిక.. వారి భవిష్యత్తుకు అభివృద్ధి బాట

📰 Generate e-Paper Clip

**పిల్లల గొంతుకకు గ్రామసభ వేదిక.. వారి భవిష్యత్తుకు అభివృద్ధి బాట!**

హనుమకొండ జిల్లా, వేలేరు మండలం:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జాతీయ బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని వేలేరు మేజర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో బాలల గ్రామసభను ఘనంగా నిర్వహించారు. సర్పంచ్ మీ. బిల్లా యాదగిరి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి సర్పంచ్ ఆహ్వానం మేరకు ముఖ్య అతిథులుగా కాజీపేట ఏసీపీ ప్రశాంత్ రెడ్డి, ధర్మసాగర్ సీఐ శ్రీనివాస్ పాల్గొన్నారు. వేలేరు మండల ఎస్సై దూదిమెట్ల నరేష్ సైతం కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఏసీపీ ప్రశాంత్ రెడ్డి, సీఐ శ్రీనివాస్, సర్పంచ్ బిల్లా యాదగిరి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.

కాజీపేట ఏసీపీ ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ భారత తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం నవంబర్ 14న జాతీయ బాలల దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని తెలిపారు. పిల్లల సమస్యలను తెలుసుకోవడం, వారి అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇవ్వడం, పాఠశాలల్లో అవసరమైన అభివృద్ధి పనులను గుర్తించి పరిష్కరించడం బాలల గ్రామసభ ముఖ్య ఉద్దేశమని వివరించారు.

విద్యార్థులు తమ సమస్యలను నిర్భయంగా గ్రామసభలో తెలియజేయాలని, చదువుతో పాటు క్రమశిక్షణ, మంచి నడవడికను అలవర్చుకొని ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. ప్రతి విద్యార్థి తన భవిష్యత్తును గొప్పగా తీర్చిదిద్దుకోవాలని, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, సమాజానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

సర్పంచ్ బిల్లా యాదగిరి మాట్లాడుతూ గ్రామంలోని ప్రతి చిన్నారికి నాణ్యమైన విద్య, మెరుగైన పాఠశాల వసతులు, క్రీడలకు అవసరమైన సౌకర్యాలు కల్పించడం తన బాధ్యతగా భావిస్తున్నానని తెలిపారు. పేదరికం కారణంగా ఏ ఒక్క చిన్నారి కూడా చదువుకు దూరం కాకూడదనే లక్ష్యంతో ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని పేర్కొన్నారు.

నేటి బాలలే రేపటి పౌరులని, పిల్లల సంక్షేమం మరియు విద్యాభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. గౌరవ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సహకారంతో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేయించి పాఠశాలల్లో అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని వివరించారు. విద్యార్థుల అవసరాలు, సమస్యలను గుర్తించి గ్రామపంచాయతీ నిధుల ద్వారా పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు.

ఈ సందర్భంగా చిన్నారులందరికీ సర్పంచ్ బిల్లా యాదగిరి హృదయపూర్వక బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ బాలల గ్రామసభ కార్యక్రమంలో ఉపసర్పంచ్ శ్రీకర్, గ్రామపంచాయతీ కార్యదర్శి విజయ, జెడ్పీ హైస్కూల్ హెచ్ఎం సత్యం, లీలా బాయ్, సీసీ రమాదేవి, వార్డు సభ్యులు సంధ్య, పర్వీన్, సురేష్, సునీల్, ఉపాధ్యాయులు, వీఓల అధ్యక్షులు, సీఏలు, అంగన్‌వాడీ టీచర్లు మరియు సుమారు 250 మంది విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.