📄 ePaper
Epaper 2
Saturday, November 14, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణజానకి నగర్‌లో ఘనంగా ఆసరా పింఛన్ల పంపిణీ

జానకి నగర్‌లో ఘనంగా ఆసరా పింఛన్ల పంపిణీ

📰 Generate e-Paper Clip

జానకి నగర్‌లో ఘనంగా ఆసరా పింఛన్ల పంపిణీ
ఎన్నికల హామీని నెరవేర్చిన కాంగ్రెస్ ప్రభుత్వం – ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు
జానకి నగర్, నవంబర్ 14: సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం జానకి నగర్ గ్రామపంచాయతీ పరిధిలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఆసరా పింఛన్ల పంపిణీ కార్యక్రమం శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నూతనంగా మంజూరైన పింఛన్ల సాంక్షన్ పత్రాలను లబ్ధిదారులకు గ్రామ సర్పంచ్ భానోతు అనూష, ఉపసర్పంచ్ రాఘవేందర్ నాయక్, వార్డు సభ్యుల చేతుల మీదుగా అందజేశారు.
గ్రామపంచాయతీ కార్యదర్శి రజిత అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు పింఛన్లను మంజూరు చేసి, పేదలు, వృద్ధులు, దివ్యాంగులకు అండగా నిలుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డిలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తూ పేద ప్రజల జీవితాల్లో మార్పు తీసుకువస్తోందని నాయకులు పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ నాయకులు భట్టు అమృ నాయక్, చిలుకూరు మండల ఎస్టీ సెల్ నాయకులు బి. రాజేష్ నాయక్, భానోతు రవి, భార్మావత్ వాసు, గ్రామ పెద్దలు, ఇతర నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.