📄 ePaper
5pm
7pm
Tuesday, November 17, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణకార్మికుల వద్దకే యూనియన్ నాయకులుసమస్యల పరిష్కారమే లక్ష్యం

కార్మికుల వద్దకే యూనియన్ నాయకులుసమస్యల పరిష్కారమే లక్ష్యం

📰 Generate e-Paper Clip

కార్మికుల వద్దకే యూనియన్ నాయకులుసమస్యల పరిష్కారమే లక్ష్యం

* ఎన్‌పీడీసీఎల్ 1104 యూనియన్ ఆధ్వర్యంలో జమ్మికుంటలో సెక్షన్ టు సెక్షన్ కార్యక్రమం

* విద్యుత్ కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకుని అధికారుల దృష్టికి తీసుకెళ్లిన నాయకులు

* ఎన్‌పీడీసీఎల్ 1104 యూనియన్ కంపెనీ కార్యదర్శి సల్వాజ రమణ రావు జిల్లా అధ్యక్షుడు తంగడ మహేందర్ జిల్లా కార్యదర్శి రంగు వెంకటనారాయణ తలగంప రాములు డివిజన్ అధ్యక్షుడు మోతే శ్రీనివాస్

జమ్మికుంట నవంబర్ 13 (ప్రజావాణి)

విద్యుత్ కార్మికుల సమస్యలను స్వయంగా తెలుసుకుని, వాటిని తక్షణమే పరిష్కరించేందుకు కృషి చేయడమే లక్ష్యంగా ఎన్‌పీడీసీఎల్ 1104 యూనియన్ ఆధ్వర్యంలో జమ్మికుంటలో సెక్షన్ టు సెక్షన్ కార్యక్రమాన్ని నిర్వహించారు యూనియన్ జెండా ఆవిష్కరణకార్మికుల వద్దకు నాయకులు అనే నినాదంతో జమ్మికుంట, హుజురాబాద్ పరిధిలోని వివిధ విద్యుత్ సెక్షన్లలో పనిచేస్తున్న కార్మికులను నాయకులు నేరుగా కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారుఈ సందర్భంగా కార్మికులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను తెలుసుకుని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సాధ్యమైన సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించేందుకు చొరవ చూపారు. కార్మికుల సమస్యల పరిష్కారంలో యూనియన్ నాయకత్వం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని భరోసా కల్పించారుఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ విద్యుత్ కార్మికులకు ఏ సమస్య ఎదురైనా రాష్ట్ర, కంపెనీ, జిల్లా స్థాయిల్లో యూనియన్ నాయకులు ముందుండి పోరాడి పరిష్కారానికి కృషి చేస్తారని తెలిపారు. కార్మికుల సంక్షేమం హక్కుల పరిరక్షణే 1104 యూనియన్ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. కార్మికుల గొంతుకగా నిలుస్తూ వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని పేర్కొన్నారుఈ కార్యక్రమంలో ఎన్‌పీడీసీఎల్ 1104 యూనియన్ కంపెనీ కార్యదర్శి సల్వాజ రమణ రావు జిల్లా అధ్యక్షుడు తంగడ మహేందర్ జిల్లా కార్యదర్శి రంగు వెంకటనారాయణ, తలగంప రాములు, డివిజన్ అధ్యక్షుడు మోతే శ్రీనివాస్, డివిజన్ కార్యదర్శి గంగిశెట్టి శంకర్, మహేశ్, రవి, అశ్వత్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.