📄 ePaper
5pm
7pm
Saturday, November 21, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణబోరు మోటారు విద్యుత్ స్విచ్ బోర్డుతో ప్రమాదం పొంచి ఉంది!

బోరు మోటారు విద్యుత్ స్విచ్ బోర్డుతో ప్రమాదం పొంచి ఉంది!

📰 Generate e-Paper Clip

*బోరు మోటారు విద్యుత్ స్విచ్ బోర్డుతో ప్రమాదం పొంచి ఉంది!*

*పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారులు, గ్రామపంచాయతీ పాలకవర్గం*

ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మంచాల నవంబర్ 12 (ప్రజావాణి ):మంచాల గ్రామంలోని బోరుబావి వద్ద ఏర్పాటు చేసిన విద్యుత్ స్విచ్ బోర్డు దెబ్బతిని ప్రమాదకరంగా మారిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బోరుమోటారు వినియోగంలో ఉండటంతో పాటు స్విచ్ బోర్డు నుంచి విద్యుత్ షాక్ తగిలే ప్రమాదం ఉందని, ముఖ్యంగా చిన్నపిల్లలు, మహిళలు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ సమస్యపై గ్రామపంచాయతీ కార్యదర్శికి, పాలకవర్గానికి పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. సంబంధిత విద్యుత్ శాఖ అధికారులకు సైతం సమస్యను తెలియజేసినా స్పందన లేకపోవడంతో గ్రామస్తులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ప్రజల ప్రాణాలకు ముప్పు పొంచి ఉన్నప్పటికీ అధికారులు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. ఏదైనా ప్రమాదం జరిగిన తర్వాత స్పందిస్తారా? ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అధికారులకు లేదా? అని నిలదీస్తున్నారు.

ఉన్నతాధికారులు ఇప్పటికైనా స్పందించాలి!

గ్రామపంచాయతీ పాలకవర్గం, విద్యుత్ శాఖ అధికారులు సమన్వయంతో వెంటనే దెబ్బతిన్న విద్యుత్ స్విచ్ బోర్డును మరమ్మతు చేయించాలని స్థానికులు కోరుతున్నారు. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని తక్షణ చర్యలు చేపట్టాలని, నిర్లక్ష్యం వహిస్తున్న సంబంధిత అధికారులపై ఉన్నతాధికారులు దృష్టి సారించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.