గుండూర్ నుంచి మహారాష్ట్రలోని ప్రముఖ పుణ్యక్షేత్రం మన్మథ స్వామి (కపిల్దార్ )దర్శనార్థం కొరకు పాదయాత్ర
మన ప్రజావాణి జుక్కల్ ఆర్ సి ప్రతినిధి నవంబర్ 13
కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని గుండుర్ గ్రామం నుండి మహారాష్ట్రలోని ప్రముఖ పుణ్యక్షేత్రం మన్మథ స్వామి కపిల్దార్ దర్శనార్థం భక్తులు భక్తిశ్రద్ధలతో పాదయాత్రగా బయలుదేరారు. స్వామివారి ఆశీస్సులు గ్రామ ప్రజలందరిపై ఉండాలని, గ్రామం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ భక్తులు ఈ పాదయాత్రను చేపట్టారు. వచ్చే కార్తీక పౌర్ణమి నాటికి పాదయాత్ర మన్మద్ స్వామి కి చేరుకుంటుంది
ఈ సందర్భంగా భక్తులు స్వామివారి నామస్మరణ చేస్తూ, ఉత్సాహంగా పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ పాదయాత్రలో సర్పంచ్ కాశీనాథ్, ఉప సర్పంచ్ లక్ష్మీబాయి విట్టల్, మారుతి శేత్కర్, మల్లికార్జున్, సంజు పటేల్, రాజు, నాగనాథ్, మల్లేష్, విలాస్, తోపాటు గ్రామానికి చెందిన పలువురు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ పాదయాత్రను చేశారు.. భక్తుల నామస్మరణలు, భజనలు, వాయిదాల నడుమ పాదయాత్ర ఆధ్యాత్మిక వాతావరణం కొనసాగింది..


